రంగస్థలం నిర్మాతలకు ఐటీ షాక్.. ఇళ్లలో సోదాలు?
రంగస్థలం సినిమా రిలీజ్‌కు ముందు నిర్మాతలకు ఆదాయపు పన్ను అధికారులు షాకిచ్చినట్టు తెలుస్తున్నది. రంగస్థలం ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్టు ఫిలింనగర్‌లో వార్తలు వెలువుడుతున్నాయి. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నివాసాలపై దాడులు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై నిర్మాతలు స్పందించకపోవడం గమనార్హం.
వెబ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం రంగస్థలం, సవ్యసాచి సినిమాకు సంబంధించిన అకౌంట్లను తనిఖీ చేసినట్టు తెలుస్తున్నది. దాంతో వారు ఆయా పత్రాలను అధికారులకు అందించినట్టు సమాచారం. ఈ నిరాధారమైన వార్తలపై నిర్మాతలు స్పందిస్తే తప్ప ఎలాంటి నిజాలు బయటకు రాకపోవచ్చు. రాంచరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం చిత్రం మార్చి 30న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.



Click it and Unblock the Notifications