»   »  'బాహుబలి' ఐటీ రైడ్: ఎంత దొరికింది?అగర్వాల్ ఎవరు? వెంకయ్యనాయుడు చెప్పారా?

'బాహుబలి' ఐటీ రైడ్: ఎంత దొరికింది?అగర్వాల్ ఎవరు? వెంకయ్యనాయుడు చెప్పారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: 'బాహుబలి' నిర్మాతల ఇళ్లపై ఐటీశాఖ ఆకస్మిక దాడులకు పాల్పడింది. ఏకకాలంలో నిర్మాతలు శోభుయార్లగడ్డ, ప్రసాద్ ఇళ్లపై రైడ్స్ నిర్వహించి సోదాలు నిర్వహిస్తున్నారు. బ్లాక్ మనీ అనుమానాలతోనే ఈ దాడులు నిర్వహించినట్లు వార్తలు ప్రచారం జరిగింది.

  అలాగే బెంగుళూరు కి చెందిన అగర్వాల్ అనే వ్యక్తి కు ఈ లింక్ లకు దాడి ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అలాగే..వెంకయ్యనాయుడు ..బాహుబలి దాడుల గురించి మాట్లాడారంటూ కూడా ఆయన అన్న మాటలు ప్రస్తావిస్తున్నారు. ఇందులో ఏది ఎంతవరకూ నిజం..అసలేం జరిగింది..


  ఈ నేపధ్యంలో బాహుబలి నిర్మాతలనుంచి ఎంత డబ్బుని సీజ్ చేసారనే విషయమై రకరకాల రూమర్స్, రూమర్స్ లాంటి వార్తలు, వార్తలు మీడియాలో ప్రచారమువుతున్నాయి. ఆ వార్తల సారాంశమేమిటి అంటే బాహుబలి నిర్మాతల నుంచి 68 కోట్లుని సీజ్ చేయటం జరిగిందని.


  అంతేకాకుండా.. బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఇళ్లు కార్యాలయాలపై ఏకకాలంలో నిర్వహించిన ఈ సోదాలలో రూ. 50 కోట్ల విలువైన వెయ్యి, 500 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. మరో ప్రక్కన అగర్వాల్ అనే వ్యక్తి వల్లే ఈ రైడ్స్ కు లింక్ దొరికిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలు ఈ అగర్వాల్ ఎవరూ అంటే..


  కొన్ని కోట్లను వైట్ గా

  కొన్ని కోట్లను వైట్ గా

  ఒక ప్రముఖ తెలుగు మీడియా సంస్థ వారు ప్రచురించిన వార్తల ప్రకారం ఈ బాహుబలి దాడుల కథేంటి అంటే... బెంగుళూరుకు చెందిన అగర్వాల్ అనే వ్యక్తి.. తన దగ్గర పనిచేసే చాలామంది ఎంప్లాయిస్ తోనూ, వారి ఫ్యామిలీ మెంబర్లతో కలిపి.. కొన్ని కోట్ల రూపాయలను 2.5 లక్షలుగా విడగొట్టి.. వారి సొంత ఎకౌంట్లలో వేయించాడు.


  అగర్వాల్ దొరికిపోయాడు

  అగర్వాల్ దొరికిపోయాడు

  అవన్నీ తిరిగి చెక్ లేదా ఆన్ లైన్ ట్రాన్సపర్ రూపంలో తన దగ్గరకు తెచ్చుకున్నాడు. ఆ విధంగా ఒక 30 కోట్లను వైట్ మనీగా మార్చాడు. బాగానే ఉంది. కాకపోతే ఇంత పెద్ద మొత్తంలో ఆన్ లైన్ ట్రాన్సఫర్ జరగటంతో ... ఐటి డిపార్టమెంట్ కు అనుమానం వచ్చి.. స్కెచ్ వేసి అగర్వాల్ ను పట్టేసుకున్నారు.


  అదీ బాహుబలితో లింక్

  అదీ బాహుబలితో లింక్

  అసలు అగర్వాల్ కు అంత డబ్బు ఎక్కడిది అని ఎంక్వైరీ చేసి తెలుసుకున్న ఐటి అండ్ ఎన్ఫోర్సమెంట్ డిపార్టమెంట్ అధికారులు.. అగర్వాల్ ...బాహుబలి సినిమా డిస్ర్టిబ్యూషన్ లో ఉన్నాడని తెలుసుకున్నారు.


  హక్కులు కూడా తీసుకుంటామని

  హక్కులు కూడా తీసుకుంటామని

  బెంగళూరులోని ఓ వ్యక్తితో అగర్వాల్ కి ఫోన్‌ చేయించారు. బ్లాక్‌ను వైట్‌ చేస్తామని ఆశపెట్టి వలలోకి లాగారు. కొన్ని ప్రాంతాల్లో ‘బాహుబలి' సినిమా హక్కులు కూడా తీసుకుంటామని అతడితో చెప్పించారు. ఆ ఎరకు చిక్కిన అగర్వాల్‌ తన వద్ద ఉన్న నల్లధనాన్ని వెల్లడించాడు. ఆ సమాచారం ఆధారంగా పక్కా ప్రణాళికతో ముందుకు కదిలారు.


  అన్ని చోట్లా ఒకేసారి

  అన్ని చోట్లా ఒకేసారి

  హైదరాబాద్‌, ముంబై, బెంగళూరుల్లో ఏకకాలంలో 15 బృందాలు శుక్రవారం దాడులు చేశాయి. బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ కార్యాలయాలు సహా హైదరాబాద్‌లో ఆరు చోట్ల, ముంబై, బెంగళూరుల్లో 9 చోట్ల సోదా చేశారు.


  ధృవీకరించలేదు

  ధృవీకరించలేదు

  ఫిల్మ్ సర్కిల్స్ నుంచి సమాచారం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రికి రూ.68 కోట్ల దాకా నగదు బయటపడినట్లు తేలింది. ఐతే ఐటీ అధికారులు ధ్రువీకరించలేదు. బాహుబలి లావాదేవీల్లో చాలావరకు నగదులోనే జరగడంతో అదంతా బ్లాక్‌మనీగానే వారు భావిస్తున్నట్టు సమాచారం.


  అన్నీ పద్దతలు ప్రకారమే..

  అన్నీ పద్దతలు ప్రకారమే..

  కానీ.. అది వైట్‌ మనీయేనని.. తమ సినిమాకు సంబంధించి అన్ని చెల్లింపులూ పద్ధతి ప్రకారమే చేస్తున్నామని బాహుబలి బృందం ఐటీ అధికారుల ముందు వాదించినట్లు తెలిసింది. ఈ వాదనకు ఐటీ అధికారులు ఒప్పుకోవట్లేదని, చిత్ర నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లు, రికార్డులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ దాడుల్లో ఈడీ అధికారులు కూడా పాల్గొన్నారు.


  మాది వైటే...

  మాది వైటే...

  హైదరాబాదులో ఏకంగా బాహుబలి నిర్మాతలు అయిన శోభు యార్లగడ్డ.. ప్రసాద్ దేవినేనికి చెందిన ఏకంగా ఆరు చోట్లపై ఒకేసారి దాడులు చేశారట. మొత్తంగా ఈ దాడుల్లో 68 కోట్లు పట్టుబడ్డాయని తెలుస్తోంది. అలాగే ఈ మనీ అంతా వైట్ అంటూ బాహుబలి నిర్మాతలు చెప్తున్నారని అంటున్నారు. అయితే ఐటీ అధికారులు ..దాన్ని నమ్మక...డబ్బుతో పాటు చాలా లావాదేవీల పత్రాలను కూడా ఐటి అధికారులు సీజ్ చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి.


  అప్పుడు జరిగింది ఇదీ

  అప్పుడు జరిగింది ఇదీ

  ఐటి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీ హిల్స్‌లోని విష్ణు అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్తులోని ఆర్‌కె మీడియా కార్యాలయంపై ఐటిఒ సుబ్రమణ్యం నేతృత్వంలో అధికారులు దాడులు జరిపారు. బాహుబలి-1 నిర్మాతలు సోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌లకు చెందిన ఆర్కా మీడియా కార్యాలయంలో దాదాపు 25 మందికి పైగా ఐటి అధికారులు, సిబ్బంది ఈ దాడులను నిర్వహించారు.


  తలుపులు మూసేసి

  తలుపులు మూసేసి

  ఐటీ అధికారులు ఆఫీసుకి చేరుకోగానే ఆర్కా మీడియాకు చెందిన సిబ్బందిని లోపల ఉంచి మిగతా వారిని బయటకు పంపించేశారు. అనంతరం తలుపులు మూసేసి విచారించినట్టు తెలుస్తోంది.


  ఆరోపణలు

  ఆరోపణలు

  దేశవ్యాప్తంగా తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం ద్వారా రూ.600 కోట్లకు పైగా లాభాలను గడించినప్పటికీ, టాక్సును చెల్లించలేదని నిర్మాతలపై ఆరోపణలున్నాయి.ఈ నేపథ్యంలోనే ఈ దాడులు జరిగినట్టు ఐటి వర్గాలు తెలిపాయి. రాత్రి వరకు సాగిన ఈ సోదాల్లో ఆర్కే కార్యాలయంతో పాటు నిర్మాతల నివాసాల్లోను సోదాలు నిర్వహించారు.


  మార్పిడి చేయటానికే...

  మార్పిడి చేయటానికే...

  రూ. 500, 1000 నోట్ల కట్టలున్న ఈ డబ్బును ఇతర ప్రాంతాలకు తరలించి మార్పిడి చేయడానికి ప్రయత్నాలు సాగుతుండగానే ఐటి అధికారులు దాడులను నిర్వహించారని చెప్తున్నారు. పలు చెక్కులు, బాండ్లు, అగ్రిమెంట్లు తదితర విలువైన పత్రాలను ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.


  ఈ ఎఫెక్ట్ తో ఇండస్ట్రీపై

  ఈ ఎఫెక్ట్ తో ఇండస్ట్రీపై

  దేశ వ్యాప్తంగా రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో.... కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. బ్లాక్ మనీ, నకిలీ కరెన్సీ లాంటి వాటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీపై భారీగానే పడింది. ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, కొందరు నటుల వద్ద బ్లాక్ మనీ ఉందని, వాటిని ఏం చేయాలో తోచక అంతా సతమతం అవుతున్నారనే ప్రచారం జోరందుకుంది.


  పని చేసేవారు సాయింతో

  పని చేసేవారు సాయింతో

  కొందరు నిర్మాతలు.... రహస్యంగా దాచిన బ్లాక్ మనీని బయటకు తీసి దాన్ని చిన్న చిన్న మొత్తాలుగా విభజించి తమ వద్ద పని చేసే పని వారు, సన్నిహితులతో బ్యాంకుల్లో వేయించి వైట్ గా మార్చుకుంటున్నారనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.


  సీక్రెట్ గా జరిగినా

  సీక్రెట్ గా జరిగినా

  సాధారణంగా సినీ పరిశ్రమలో ...ప్రీ రిలీజ్ బిజినెస్ అంతా కూడా సీక్రెట్ గా సాగిపోతుంది. ఎందుకంటే ఎక్కడ ఏం లీక్ చేస్తే ఆదాయపు పన్ను శాఖ ఎటునుండి ఎలా దాడిచేస్తుందో అని నిర్మాతల భయం . ఆగడు సినిమా ప్రీ రిలీజ్ డీల్స్ గురించి బయటకు పొక్కినప్పుడు.. రిలీజ్ కు ఒక్కరోజు ముందు సదరు ప్రొడ్యూసర్ పై ఐటి రెయిడ్స్ జరిగాయ్. అలాగే దిల్ రాజు ఒక పెద్ద సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా.. రిలీజ్ కు వన్ డే ముందు ఆయనకు ఐటి షాక్ కొట్టింది.


  బాహుబలి గురించేనా ఆయన చెప్పింది...

  బాహుబలి గురించేనా ఆయన చెప్పింది...

  "మీరు సినిమా సూపర్ హిట్ అయిందంటూ 100 కోట్లు.. 200 కోట్లు.. 300 కోట్లు వసూళ్లు వచ్చాయంటారు. మహాబలి అంటూ ఉంటారు. ఇప్పుడు ఇన్ కం ట్యాక్స్ అధికారులు కో బలి అని చెప్పి రికార్డులు చూపించమన్నారు. మీరు నిజంగా పన్నులన్నీ కట్టేసి ఉంటే ఇందులో భయపడాల్సిన పనేమీ ఉండదు. లేకపోతే ప్రభుత్వం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది" అని ఫిలిం నగర్ క్లబ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు వెంకయ్య నాయుడు.


  English summary
  If we have to believe the news doing rounds in media circles, nearly 68 crores got seized from the makers of “Baahubali”, Shobu Yarlagadda and Prasad Devineni’s offices. Actually other day rumours have come out that Baahubali makers got raided by the IT department officials.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more