అతనితో ప్రియమణి పెళ్ళా?
ప్రియమణి పెళ్ళనే వార్తలు మరో సారి గుప్పుమన్నాయి. "మిత్రుడు"బాక్సాఫీసు వద్ద బోర్లా పడింది. తర్వాత ప్రియమణికి అవకాశం ఇస్తామంటూ టాలీవుడ్ లో అడిగినవారే కనబడలేదంటున్నారు. దీంతో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తరుణ్ తో ప్రియమణి గత కొంత కాలంగా ప్రేమలో ఉందని కొందరంటూంటే..మరికొందరు మళయాళ నటుడు పృధ్వీరాజ్ తో ఆమె మరింత ముందుకెళ్ళిందంటూ మాట్లాడుతున్నారు. వీటిల్లో నిజమెంత అని ఆమె ముందు ఉంచినప్పుడు ప్రియమణి క్లారిటీతో క్లారిఫై చేసింది. తరుణ్ తో నా ప్రేమ వ్యవహారం ఆధారాలు లేనిది. నవవసంతం షూటింగ్ లో మా ఇద్దరి పరిచయం జరిగింది. ఆ తర్వాత మేము అస్సలు కలిసింది చాలా తక్కువ. అలాగే నా పర్శనల్ గా అయితే అస్సలు ఆ తర్వాత కలవనేలేదు. ఇక ఒక హీరో టయోటా ఇన్నోవో కారు గిప్ట్ ఇచ్చారంటున్నారు..నిజంగా అలాంటి చీప్ రూమర్స్ ఎలా పుట్టిస్తారో తోలియదు.
నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో హైదరాబాద్ లో ఆ కారు కొనుక్కున్నాను. ఎవరూ గిప్ట్ ఇవ్వలేదు. అది నా పర్శనల్ కారు అని తేల్చేసింది. ఇక కన్నడ మీడియా మీతో మళయాళ నటుడు పృధ్వీ రాజ్ కు ముడి పెడుతున్నారు కదా అంటే..పృధ్వీ రాజ్ తల్లి, మా అమ్మ ఇద్దరూ కాలెజ్ మేట్స్. అలా మా రెండు కుటుంబాలు రెగ్యులర్ గా ఇంట్రాక్ట్ అవతూంటాం. అతను మా ఫ్యామిలీ ప్రెండ్ అంతే. మేం రోజూ కలిసినా మేం ప్రెండ్ షిప్ లెవిల్స్ ని దాటలేదు. ప్రసుత్తం తాను సింగిల్ గానే ఉంటున్నాను అయితే ఎవరితోనూ కలవటానికి రెడీగా లేనని చెప్పింది. ప్రేమ వ్యవహారాలు కన్నా తాను కెరీర్ లో ఎదగటానకే ప్రయారిటీ ఇస్టున్నట్లు చెప్పింది.


Click it and Unblock the Notifications











