రవితేజకు భారీ షాకిచ్చిన ఆ దేశ ప్రభుత్వం: అర్థాంతరంగా ముగిసిన ‘ఖిలాడీ’ షూట్

చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతోన్న సమయంలో.. ఈ ఏడాది ప్రారంభంలోనే గోపీచంద్ మలినేని తెరకెక్కించిన 'క్రాక్'తో భారీ విజయాన్ని అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా వసూలు చేసి రికార్డు స్థాయి విజయాన్ని అందుకుంది. ఫలితంగా నిర్మాతపై లాభాల వర్షం కురిపించింది. ఈ మూవీ ఇచ్చిన జోష్‌లోనే ఈ ఎనర్జిటిక్ సీనియర్ హీరో 'ఖిలాడీ' అనే ప్రాజెక్టును పట్టాలెక్కించేశాడు. ఇటలీలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. దానికి తాజాగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.

రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న చిత్రమే 'ఖిలాడీ'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీ దేశంలో జరుగుతోంది. అక్కడ కొన్ని పాటలతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా షూట్ చేశారు. మరికొన్ని రోజులు చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ మరోమారు ఉధృతం అవడంతో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో మాస్ మహారాజా మూవీ షూటింగ్‌ను అనుమతులు నిరాకరించినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో చిత్రీకరణకు ప్యాకప్ చెప్పేసినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Italy Government Shock to Ravi Tejas Khiladi

రవితేజ కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఖిలాడీ'ని పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సస్పెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఇందులో కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇది మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X