బాలయ్య సినిమాపై జబర్దస్త్ ఎఫెక్ట్.. బోయపాటి పవర్‌ఫుల్ స్కెచ్!

మాస్ పల్స్ బాగా తెలిసిన బోయపాటి శ్రీను, అన్ని వర్గాల ప్రేక్షకులను రంజింపజేయగల సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ కొత్త సినిమా రానున్న సంగతి తెలిసిందే. చాలాకాలంగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయం చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాపై సినిమాపై జబర్దస్త్ ఎఫెక్ట్ పడనుందని అంటున్నారు. ఇంతకీ ఏంటా ఎఫెక్ట్? అది లాభమా లేక నష్టమా? వివరాల్లోకి పోతే..

'రూలర్' అంటున్న బాలయ్య.. బోయపాటితో

'రూలర్' అంటున్న బాలయ్య.. బోయపాటితో

నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా జర్నీ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. దశాబ్దాల కాలంగా తెలుగు సినీ పరిశ్రమను ఉర్రూతలూగిస్తున్న బాలయ్య బాబు.. ప్రస్తుతం తన 105 సినిమా 'రూలర్' సినిమాతో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ సినిమా విడుదల కాగానే బోయపాటి శ్రీను సెట్స్ పైకి వెళ్లనున్నారు బాలకృష్ణ.

నందమూరి అభిమానుల అంచనాలు.. బోయపాటి స్పెషల్ కేర్

నందమూరి అభిమానుల అంచనాలు.. బోయపాటి స్పెషల్ కేర్

ఈ నేపథ్యంలో బాలకృష్ణ- బోయపాటి కాంబోకి సంబంధించిన వివరాలు నందమూరి అభిమాన వర్గాల్లో ఇప్పటినుంచే ఆతృతను పెంచేస్తున్నాయి. సింహా, లెజెండ్ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు. దీంతో అభిమానుల అంచనాలను రీచ్ అయ్యేలా ఈ సినిమా నటీనటుల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు బోయపాటి.

బాలయ్యతో రోజా ఢీ.. అనసూయపై కన్నేసిన బోయపాటి

బాలయ్యతో రోజా ఢీ.. అనసూయపై కన్నేసిన బోయపాటి

ఇప్పటికే ఈ సినిమాలో బాలకృష్ణను ఢీ కొట్టే విలన్ పాత్రలో రోజాను తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. రోజా కూడా బాలయ్యను ఢీ కొట్టేందుకు సిద్ధమైందని సమాచారం. ఇదిలాఉంటే తాజాగా అనసూయను కూడా ఓ ముఖ్యపాత్ర కోసం సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. రంగస్థలంలో రంగమ్మత్తను మించిన క్యారెక్టర్ ఈమె కోసం డిజైన్ చేశారట బోయపాటి.

Recommended Video

#CineBox : Prabhas To Have Dual Role In His Next Period Drama 'Jaan' ?
జబర్దస్త్ ఎఫెక్ట్.. రెగ్యులర్ కమెడియన్స్‌‌‌ని పక్కన పెట్టేసి

జబర్దస్త్ ఎఫెక్ట్.. రెగ్యులర్ కమెడియన్స్‌‌‌ని పక్కన పెట్టేసి

ఇక ఈ సినిమాలో రెగ్యులర్ కమెడియన్స్‌‌కు బదులుగా.. జబర్ధస్త్ షో లో పాపులర్ అయిన కమెడియన్స్‌ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని మరో సమాచారం. ఈ సినిమాను డిసెంబర్ నెలలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించి, వచ్చే ఏడాది ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఏదేమైనా మొత్తంగా చూస్తే బాలకృష్ణ- బోయపాటి కాంబోపై జబర్దస్త్ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X