‘జబర్‌దస్త్'... కాపీ సినిమానా?.. కథేంటి?
హైదరాబాద్: 'అలా మొదలైంది' చిత్రంతో పరిచయమైన దర్శకురాలు నందినీరెడ్డి రెండో చిత్రం 'జబర్‌దస్త్' ఈ రోజు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీలో హిట్టయన బ్యాండ్ బాజా బారాత్ కాపీ అని వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి సినిమాకు ఎంతో ప్రామిసింగ్ డైరక్టర్ గా అనిపించుకున్న దర్శకురాలు రెండో సినిమాకు ఇలా కాపీ.. పేస్ట్ వ్యవహారంలోకి దిగిపోవటమేంటని అంటున్నారు. బ్యాండ్ బాజా బారాత్ కథనే కాస్త అటూ ఇటూ గా మార్చి తెరకెక్కించిందని చెప్తున్నారు.
తెలిసిన కథ ప్రకారం... లక్ష్యం అంటూ లేకుండా, ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేస్తూ తిరిగే కుర్రాడు బైర్రాజు (సిద్ధార్థ్). జీవితంలో ఏదో సాధించాలనే తపన ఉన్న యువతి శ్రియ (సమంత). ఆమెకురావాల్సిన జాబ్ కూడా కొట్టేస్తాడు. తర్వాత ఇద్దరూ కలిసి.. ధర్మవరపు సుబ్రమణ్యం సలహాతో.... ఇద్దరూ పెళ్లిళ్లు చేసిపెట్టే వ్యాపారం (వెడ్డింగ్ ప్లానర్) మొదలెడతారు. ఆ వ్యాపారం పెరుగుతుంది. మరో ప్రక్క శ్రియ.. బైర్రాజుతో ప్రేమలో పడుతుంది. కానీ ఈ విషయం మాత్రం బైర్రాజు తెలుసుకోలేడు. ఇద్దరి మధ్యా గొడవలు మొదలవుతాయి. ఇద్దరూ విడిపోతారు. వ్యాపారం కూడా విడిపోతుంది.
కొన్ని రోజులు గడిచాక వీరి మధ్యకి మరో భామ (నిత్య మీనన్) ప్రవేశిస్తుంది. నిత్యా మీనన్ సాయింతో మళ్లీ బైర్రాజు.. మరో బ్యూరో పెడతాడు. తర్వాత శ్రియ ఎలా బైర్రాజుని తన వైపుకి తిప్పుకుందనేది మిగాత కథ. సినిమాలో తెలంగాణ శకుంతల కామెడీ, సమంత లిప్ లాక్, త్రాగుబోతు రమేష్ కామెడీ బాగా పేలాయి.
ఇక వెడ్డింగ్ బెల్స్ అనే ఇంగ్లీషు సినిమా ఆధారంగా వచ్చిన ఆ సినిమా బాలీవుడ్‌లో పెద్ద హిట్‌గా నిలిచింది. అది సరే, ఇంతకీ ఆ హిందీ సినిమాను నాని హీరోగా తీయాలని ఓ నిర్మాత కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అతగాడి పరిస్థతి ఏమిటన్నది అసలు ప్రశ్నగా ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. హీరో సిద్ధార్థ, సమంత కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అలా మొదలైంది చిత్రం మంచి విజయం సాధించటం, సమంత హీరోయిన్ కావటం సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ఈ అంచనాలను ఏ విధంగా అందుకుంటారో మరికొద్ది గంటల్లో తేలనుంది.


Click it and Unblock the Notifications











