జబర్దస్త్ జడ్జ్‌పై క్లారిటీ.. రోజా పక్కన నాగబాబు స్థానంలో ఎవరంటే..!
గత కొన్ని రోజులుగా బుల్లితెర పాపులారిటీ షో జబర్దస్త్‌కి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి. గత ఏడేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులకు ఆనందాల విందు ఇచ్చిన ఈ షో నుంచి ఊహించని రీతిలో నాగబాబు తప్పుకోవడం అందరికీ షాకిచ్చింది. దీంతో ఆయన ప్లేస్ భర్తీ చేసే సత్తా ఉన్నోళ్లు లేరని, ఇక జబర్దస్త్ కళ తప్పినట్లే అని టాక్ బయటకొచ్చింది. అయినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగేయని జబర్దస్త్ మేనేజ్‌మెంట్ చివరకు ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఆ వివరాలు చూద్దామా..

నాగబాబు, రోజా నవ్వులు.. కనెక్ట్ అయిన ప్రేక్షకులు
జబర్దస్త్ అంటేనే నవ్వుల హరివిల్లు. ఈ షోకి ఇప్పటికే ఎంతో మంది కమెడియన్స్ వచ్చి వెళ్లారు. ఎందరో కమెడియన్స్ లైఫ్ మార్చేసింది ఈ జబర్దస్త్. అయితే షో మొదలైనప్పటి నుంచి నవ్వుల రారాజు నాగబాబు, రోజా మాత్రం జడ్జ్‌లు గా కొనసాగుతూనే ఉన్నారు. వీరి నవ్వులు బాగా కనెక్ట్ అయ్యారు బుల్లితెర ప్రేక్షకులు.

నాగబాబు లెఫ్ట్.. రోజా పక్కన ఆయన స్థానంలో!
ఇంతలో ఇటీవలే జబర్దస్త్ షో నుంచి బయటకొచ్చిన నాగబాబు.. వేరే ఛానెల్ లోకి వెళ్లిపోయారు. దీంతో రోజా ఒంటరిగా మారింది. ఈ వారం ప్రసారం కానున్న షోలో ఆమె ఒక్కరే జడ్జిగా కనిపించబోతున్నారు. అయితే ఈ ఒక్క వారం మినహాయించి వచ్చే వారం లోగానే రోజా పక్కన నాగబాబు స్థానంలో వేరే జడ్జ్‌ని నియమించే పనుల్లో పడిందట జబర్దస్త్ మేనేజ్‌మెంట్.

నాగబాబు స్థానంలో నరేష్.. ఆయన రియాక్షన్
ఇదిలా ఉంటే జబర్దస్త్ షోలో రోజా పక్కన కూర్చునే వ్యక్తి సీనియర్ నటుడు, కమెడియన్ నరేష్ అని గత రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఈయనే జబర్దస్త్‌కు కొత్త జడ్జిగా వ్యవహరించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన నరేష్.. ఇప్పటి వరకు ఆ ప్రతిపాదన తన దగ్గరకు రాలేదని, వస్తే ఆలోచిస్తానని చెప్పేశారు.
Recommended Video

జబర్దస్త్ మేనేజ్‌మెంట్.. ఫైనల్ డిసీజన్
దీంతో సాయి కుమార్, అలీ, బండ్ల గణేష్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే సాయికుమార్, అలీ బుల్లితెర వ్యాఖ్యాతలుగా పలు కార్యక్రమాలు చేశారు. కానీ బండ్ల గణేష్ మాత్రం బుల్లితెరపై ఇప్పటిదాకా కనిపించలేదు. కానీ బండ్ల గణేష్ లో నవ్వించే లక్షణాలు ఎక్కువే. సో.. ఫైనల్‌గా ఈ నాలుగురిలోనే ఒక్కరిని రోజా పక్కన కూర్చోబెట్టాలని బలంగా ఫిక్స్ అయిందట జబర్దస్త్ మేనేజ్‌మెంట్.


Click it and Unblock the Notifications











