శంకర్ ‘ఐ’: చిరంజీవి, జాకీ చాన్ ఒకే వేదిక పైకి...?
హైదరాబాద్: హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాకీ చాన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదికపైకి రాబోతున్నారు. శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ‘ఐ' తెలుగు వర్షన్ ఆడియో వేడకలో ఈ సంఘటన చోటు చేసుకోబోతోంది. ‘ఐ' ఆడియో వేడుకకు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్, జాకీ చాన్ రాబోతున్నారని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ గతంలోనే ప్రకటించారు.
ఆయన చెప్పిన విధంగానే సెప్టెంబర్ 15న జరిగిన ఆడియో వేడుకకు హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ హాజరయ్యారు. హైదరాబాద్ లో జరిగే తెలుగు వెర్షన్ ‘ఐ' ఆడియో వేడుకకు జాకీ ఛాన్ హాజరవ్వబోతున్నారు. ఈ వేడకకు మెగాస్టార్ చిరంజీవి, మరికొందరు తెలుగు సినీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 22 న ‘ఐ' సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి సారిగా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక భాషల్లో, అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 2న ఆడియో విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలో విక్రమ్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘ఐ' సినిమాలో మూడు గెటప్స్ లో కనపడతాను. సినిమా మోడలింగ్ ఫీల్డ్ కి సంబంధించిన పాయింటతో రూపొందింది. మోడలింగ్ రంగంలోకి వచ్చిన ఓ వ్యక్తి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడనేదే కోణంలో సినిమా ఉంటుంది. శంకర్ స్టయిల్ లో సినిమా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా చూసిన ప్రేక్షకులు థ్రిల్ కి ఫీలవుతారు అన్నారు.


Click it and Unblock the Notifications











