రణ్‌బీర్ కపూర్‌ను ఫాలో అవుతున్న జాకీ భగ్నానీ.. రకుల్‌తో ఆ రేంజులో హనీమూన్ ప్లాన్?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ పెళ్లాడి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇక వీరి పెళ్లి గోవాలోని ఓ రిసార్ట్ లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే జాకీ భగ్నానీ తన హనీమూన్ విషయంలో రణబీర్ కపూర్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ కోసం ఓ భారీ ప్లాన్ వేశారట. ఈ న్యూస్ బాలీవుడ్ వర్గాల్లో హల్ చల్ చేస్తుంది. అసలు జాకీ ఏం ప్లాన్ చేశాడు. రణబీర్ ను ఫాలో అవడం ఏంటి అనేది ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
2011లో ప్రేమలో : జాకీ భగ్నాని.. బాలీవుడ్ స్టార్ నిర్మాతలలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న ప్రొడ్యూసర్. ఒక్క నిర్మాతే కాదు.. నటుడిగా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు జాకీ. అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో గత కొన్నేళ్లుగా ఈ కుర్ర ప్రొడ్యూసర్ ప్రేమలో మునిగిలేలుతున్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమ 2011లోనే స్టార్ట్ అయినప్పటికీ... ఒకరి గురించి ఒకరు తెలుసుకొని చివరికి 2021 లో వీరి ప్రేమని అధికారికంగా రివిల్ చేశారు.

2024లో పెళ్లి : ఇక తాజాగా 2024 లో రకుల్ ప్రీత్ సింగ్, ఆమె ప్రియుడు జాకీ గోవాలోని ఓ రిసార్ట్ లో అంగరంగ వైభవంగా రెండు సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాల మధ్య, సన్నిహీతులు, సెలబ్రెటీల మధ్య ఈ కొత్తజంట ఏడడుగులు వేశారు. ఇక పెళ్లి వీడియో కూడా సినిమా లెవెల్ లో ఉంది. ప్రధాని మోదీ సైతం వీరికి విషెష్ చెప్పడం దేశం మొత్తం వీరి పెళ్లి గురించి చర్చించుకునేలా చేసింది. ఇక ఇదిలా ఉంటే.. రకుల్ ప్రీత్ సింగ్ జాకి భగ్నానీల గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.
హనీమూన్ ట్రిప్ : అసలు విషయం ఏంటంటే.. ఈ జంట హనీమూన్ ట్రిప్ ను నెక్ట్స్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారట. అందరికంటే వెరైటీగా వీరు తమ హనీమూన్ ని ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. మరీ ముఖ్యంగా హనీమూన్ విషయంలో రణబీర్ కపూర్ ని జాకీ ఫాలోఅవుతున్నారని తెలుస్తోంది. అయితే రణబీర్ కపూర్ ను ఫాలో అవ్వడం ఏంటి అనేది మీ డౌట్ కదా. ఇటీవల వచ్చిన యానిమల్ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలో లేదు.

రణబీర్ కపూర్ ను ఫాలో : బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ తన హనీమూన్ ను రష్మిక తో ఎప్పటికీ గుర్తిండి పోయే విధంగా ఫ్లైట్లో ప్లాన్ చేస్తాడు. అయితే ఈ సినిమా చూసిన జాకీ భగ్నాని పెళ్లికి ముందే రకుల్ ప్రీత్ సింగ్ తో ఈ విషయం చెప్పి మనం కూడా హనీమూన్ ని వెరైటీగా ఇలా ప్లాన్ చేద్దామని అన్నారని తెలుస్తోంది. ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో, బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అప్పుడే హనీమూన్ : జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లయిన వారం రోజులకే హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పటికీ సినిమా షూటింగ్స్ ఉండడం కారణంగా తమ హనీమూన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ అక్షయ్ కుమార్ తో బాలీవుడ్ లో ఓ మూవీ చేస్తుండగా... జాకీ భగ్నాని కూడా అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ లతో బడే మియాన్ చోటే మియాన్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్స్ కంప్లీట్ అయ్యాక హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారట. ఈ న్యూస్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











