బ్యాడ్ బాయ్ ప్రభాస్‌తో శ్రీలంకన్ బ్యూటీ రొమాన్స్.. ఎంత తీసుకుందో తెలుసా?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'సాహో'. బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. దీనికి తోడు హై టెక్నికల్ వ్యాల్యూస్‌ జోడించి షూటింగ్ జరపడం, దాదాపు రెండేళ్ల తర్వాత వస్తున్న ప్రభాస్ హీరోగా వెండితెరపై కనిపించనుండటంతో ప్రేక్షకుల్లో ఉన్న ఆత్రుత రెట్టింపయింది. ఇదిలా ఉంటే ప్రభాస్ సాహోకి సంబందించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది.

'బ్యాడ్ బాయ్' ప్రభాస్‌తో శ్రీలంకన్ బ్యూటీ రొమాన్స్

'బ్యాడ్ బాయ్' ప్రభాస్‌తో శ్రీలంకన్ బ్యూటీ రొమాన్స్

ఇటీవలే సాహో సినిమా నుంచి 'బ్యాడ్ బాయ్' వీడియో సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. హై రేంజ్‌లో చిత్రీకరించబడింది ఈ సాంగ్ ప్రభాస్ అభిమానులతో పాటు వరల్డ్ వైడ్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో ప్రభాస్ రొమాన్స్ హైలైట్‌గా నిలిచింది.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హవా

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హవా

ముందుగా ఈ వీడియో సాంగ్‌ని సాహో ప్రీ రీలీజ్ ఈవెంట్ లో ప్రదర్శించారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల వెంటనే యూ ట్యూబ్‌లో రిలీజ్ చేయకుండా ఆ మరుసటి రోజు యూ ట్యూబ్‌లో పెట్టారు. పొట్టి పొట్టి డ్రెస్‌లు వేసుకుని, హాట్ హాట్‌గా కనిపిస్తున్న భామల నడుమ ప్రభాస్ ఒక్కడే ఉన్న ఈ సాంగ్‌ లో చిందులేస్తూ కనిపించడం యూత్ ఆడియన్స్‌కి మాంచి కిక్కిస్తోంది.

యూ ట్యూబ్‌లో ట్రెండింగ్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

యూ ట్యూబ్‌లో ట్రెండింగ్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

బ్యాడ్ బాయ్ అంటూ ఉర్రూతలూగించే ట్యూన్స్ నడుమ శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌, ఇతర అందాల భామలతో ప్రభాస్ చేస్తున్న రొమాన్స్ హైలైట్ అవుతుండటంతో ఈ వీడియో సాంగ్ యూ ట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్‌లో చేరిపోయింది. ప్రస్తుతం 'బ్యాడ్ బాయ్' సాంగ్ యూ ట్యూబ్ ట్రెండింగ్ లో మూడో స్థానంలో కొనసాగుతోంది.

శ్రీలంకన్ బ్యూటీ ఛార్జ్..

శ్రీలంకన్ బ్యూటీ ఛార్జ్..

సాహో ఈ స్పెషల్ సాంగ్‌లో ప్రభాస్‌తో చిందులేసేందుకు గాను జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ కి 2 కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చారని సమాచారం. ప్రభాస్ పక్కన ఆమె చిందులేయడం ఇదే మొదటిసారి. ఈ సాంగ్ కి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ అందాలు ప్లస్ అయ్యాయని చెప్పుకోవచ్చు.

శ్రద్ద కపూర్, ప్రభాస్.. సాహో

శ్రద్ద కపూర్, ప్రభాస్.. సాహో

యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘సాహో' చిత్రంలో శ్రధ్ధాక‌పూర్‌ హీరోయిన్‌గా నటించింది. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ఏ, విక్ర‌మ్‌లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మించారు. ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సాహో విడుదల కానుంది. ఈ చిత్రంలో జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, వెన్నెల కిషోర్‌, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 30 న సాహో విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X