For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మాయగాడి వలలో పడిన పవన్ హీరోయిన్.. క్రిష్ సినిమా నుంచి అవుట్.. ఆమె ప్లేస్ లో ఎవరంటే?

  |

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క ఏపీలో రాజకీయాలు చూసుకుంటూనే మరో పక్క సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిల్వగా ఆయన చేస్తున్న హరిహర వీరమల్లు గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

   క్రిష్ జాగర్లమూడి హరిహర వీరమల్లు

  క్రిష్ జాగర్లమూడి హరిహర వీరమల్లు

  'వకీల్ సాబ్' షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో మరో మూడు ప్రాజెక్టులు ఫైనల్ చేసిన ఆయన ఇప్పుడు ఆ షూటింగ్‌లతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. పవన్ ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్టుల్లో టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తీస్తోన్న 'హరిహర వీరమల్లు' ఒకటి. మొగల్స్ మరియు కుతుబ్ షాహిస్ శకం నేపథ్యంలో 17 వ శతాబ్దంలోనే ఈ సినిమా కధ సెట్ చేశారు.

   జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా

  జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా

  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమాలో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకూ రాలేదు.

  వాయిదా పడుతూ

  వాయిదా పడుతూ

  అయితే, 'హరిహర వీరమల్లు' షూటింగ్ చాలా వరకు పూర్తయింది. వాస్తవానికి ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా కరోనా లాంటి అనివార్య కారణాల వల్ల తరచూ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో త్వరలోనే దీన్ని పున: ప్రారంభించాలని సినిమా యూనిట్ యోచిస్తోంది. ఇప్పటికే దీని కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌లను కూడా నిర్మించారు. ఇక, వచ్చే నెల నుంచి పవర్ స్టార్ ఈ సినిమా షూటింగ్‌ను షురూ చేయబోతున్నాడని తెలుస్తోంది.

   చక్కర్లు కొట్టగా

  చక్కర్లు కొట్టగా

  'హరిహర వీరమల్లు' షూటింగ్ నుంచి నిధి అగర్వాల్ తప్పుకుందని ఇటీవల ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొట్టగా ఆమె తప్పుకోలేదు అని, ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించిన చాలా వరకు షూటింగ్ కూడా పూర్తయింది అని చెబుతున్నారు. అయితే మాయగాడు సుఖేష్ చంద్రాశేఖర్ మాయలో పడిన జాక్వెలిన్ ని అరెస్ట్ చేస్తార‌ని ఆరోప‌ణలు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆమె ప్లేస్ లో బాలీవుడ్ ముద్దుగుమ్మనర్గీస్ ఫక్రీ ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

  విమానాశ్రయంలో అదుపులోకి

  విమానాశ్రయంలో అదుపులోకి

  ఎందుకంటే ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరు కావాల్సిందిగా నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సమన్లు ​​అందాయి. డిసెంబర్ 8న మనీలాండరింగ్ కేసులో ఆమెను విచారించనున్నారు. సోమవారం తెల్లవారు జామున విదేశాలకు వెళ్తున్న ఈ నటిని విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.

  PSPK 27 : Nidhhi Agerwal To Star Opposite Pawan Kalyan In Periodic Drama
   లుక్ అవుట్ నోటీసులు

  లుక్ అవుట్ నోటీసులు

  అయితే కొన్ని వర్కింగులు ఇచ్చిన తరువాత, ఈడీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను విడుదల చేసింది మరియు ఆమెను విమానాశ్రయం నుండి బయలుదేరడానికి అనుమతించింది. ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ఫెర్నాండెజ్ విదేశాలకు వెళ్లకుండా నిలిపి వేసింది. మనీలాండరింగ్ కేసులో నటిపై ఈ లుక్ అవుట్ నోటీసులు జారీ అయింది. ఇదే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను కొన్ని నెలల క్రితం ప్రశ్నించారు.

  English summary
  Jacqueline Fernandez reportedly out from pawan kalyan's harihara veeramallu
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X