పవన్ కల్యాణ్‌తో జాక్వలైన్ ఫెర్నాండేజ్ రొమాన్స్.. ఏ సినిమా కోసమంటే..
టాలీవుడ్‌లో రోజుకో వార్త వకీల్ సాబ్‌ను చుట్టుముడుతున్నది. కరోనా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో అనుకొన్న ప్లాన్ ప్రకారం ప్రేక్షకులకు ముందుకు వకీల్ సాబ్‌ను తీసుకురావడంలో ఇబ్బంది ఏర్పడిన నేపథ్యంలో నిర్మాత, దర్శకులపై ఒత్తిడి రోజు రోజుకు పెరుగుతున్నదనే వార్తలు వస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా హీరోయిన్ పాత్రను కట్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా వకీల్ సాబ్ కోసం బాలీవుడ్ నుంచి హీరోయిన్‌ను పట్టుకొస్తున్నారనే విషయంతో ఆ సినిమాలో హీరోయిన్‌పై మళ్లీ చర్చ మొదలైంది.
వాస్తవానికి పింక్ సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రకు హీరోయిన్ లేదనే విషయం అందరికి తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని, కమర్షియల్ స్పేస్ కోసం హీరోయిన్ పాత్రను సృష్టించడం జరిగింది. అయితే వకీల్ సాబ్‌లో పవన్ కల్యాణ్ సరసన బాలీవుడ్ తార జాక్వలైన్ ఫెర్నాండేజ్ నటిస్తున్నారనే వార్త బలంగా ప్రచారం అవుతున్నది. ఇటీవల ఈ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ కోసం చిత్ర యూనిట్ జాక్వలైన్‌తో సంప్రదింపులు జరిపారనే విషయం వెలుగులోకి వచ్చింది.

జాక్వలైన్ విషయానికి వస్తే.. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు పరోక్షంగా పరిచయమైంది. సాహో చిత్రంలో ఓ పాటలో ప్రభాస్ సరసన మెరిసింది. ఇక ప్రస్తుత వార్త నిజమైతే.. నేరుగా వకీల్ సాబ్‌తో జాక్వలైన్ టాలీవుడ్‌లోకి ప్రవేశించినట్లవుతుంది.
ఇక పింక్ రీమేక్‌గా రూపొందుతున్న వకీల్ సాబ్ సినిమా విషయానికి వస్తే.. నివేదా థామస్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇంకా అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే 80 శాతం మేరకు షూటింగ్ పూర్తి చేసుకొన్నది. లాక్ డౌన్ కారణంగా షూట్ వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











