Don't Miss!
- News షర్మిలపై జగన్ కామెంట్స్ ! చంద్రబాబు కౌంటర్-సజ్జల ఎన్ కౌంటర్..!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
RRR: ఎన్టీఆర్‌కు జోడిగా సల్మాన్ ఖాన్ హీరోయిన్.. వరుసగా ఊహాగానాలు!
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్ర తదుపరి షూటింగ్ పూణే, ఢిల్లీ, కోల్ కతా లాంటి నగరాల్లో జరగనుంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా బ్రిటిష్ భామ డైసీ ఎడ్గార్ జోన్స్ ని రాజమౌళి ఎంపిక చేశాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి డైసీ తప్పుకుంది. దీనితో రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ కు సరైన జోడీని వెతికే పనిలో తలమునకలై ఉన్నాడు. ఈ క్రమంలో చాలా మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
సల్మాన్ ఖాన్ హీరోయిన్
శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. హౌస్ ఫుల్ 2, మర్డర్ 2, రేస్ 2 లాంటి చిత్రాల్లో జాక్వెలిన్ నటించింది. కానీ జాక్వెలిన్ క్రేజ్ అమాంతం పెంచిన చిత్రం మాత్రం కిక్. సల్మాన్ ఖాన్ సరసన జాక్వెలిన్ అందాలు ఆరబోసింది. కిక్ చిత్రం తర్వాత జాక్వెలిన్ కు బాలీవుడ్లో అవకాశాలు పెరిగాయి. కానీ ఇటీవల జాక్వెలిన్ కు పెద్దగా విజయాలు లేవు. తాజాగా ఓ క్రేజీ ఆఫర్ జాక్వెలిన్ తలుపు తట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
ఎన్టీఆర్‌కు జోడిగా
రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు హీరోయిన్ ని ఎంపిక చేయాల్సి ఉంది. శ్రద్దా కపూర్, పరిణీతి చోప్రా లాంటి పేర్లు వినిపించాయి. కానీ ఈ బాలీవుడ్ భామలు ఇద్దరూ ఆర్ఆర్ఆర్ చిత్రానికి నో చెప్పినట్లు తెలుస్తోంది. తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరు తెరపైకి వచ్చింది.ఎన్టీఆర్ కు హీరోయిన్ గా రాజమౌళి వరుసగా బాలీవుడ్ నటీమణులని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే జాక్వెలిన్ ని తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
తదుపరి షెడ్యూల్
రాజమౌళి ఇప్పటివరకు హీరోయిన్లు లేకుండానే రెండు షెడ్యూల్స్ ఫినిష్ చేశారు. తదుపరి జరగబోయే షెడ్యూల్స్ లో హీరోయిన్ల సన్నివేశాలు కూడా ఉన్నాయి. దీనితో వీలైనంత త్వరగా ఎన్టీఆర్ హీరోయిన్ ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. రాంచరణ్ కు గాయం కావడంతో షూటింగ్ కొన్ని వారాల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
కీలక పాత్రల్లో
ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ నటుడు సముద్రఖని మరో ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. 1920 నేపథ్యంలో బ్రిటిష్ కాలానికి చేసిన కథగా ఈ చిత్రం సాగుతుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2020 జులై 30న విడుదల చేయనున్నారు.