జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్.. ఆ హీరో చేస్తే అభిమానులు తట్టుకోగలరా?

జగదేక వీరుడు అతిలోక సుందరి విడుదలై రీసెంట్ గా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఆ సినిమా ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటిగా కొనసాగుతూనే ఉంది. ఆ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మరో స్థాయికి చేరుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది. ఇక చాలా కాలం తరువాత ఆ ట్రెండ్ సెట్టర్ కి సీక్వెల్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

బిగ్ డౌట్..

బిగ్ డౌట్..

పాత జ్ఞాపకాలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే తెలియని ఒక అనుభూతి కలుగుతుంది. అయితే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు సీక్వెల్ వస్తోంది అంటే కూడా అభిమానుల్లో ఒక స్పెషల్ ఎట్రాక్షన్ నెలకొంటుంది. అంతగా ట్రెండ్ సెట్ చేసిన ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని మించేలా ఎవరు చేస్తారనేది పెద్ద సందేహం.. ఇక దేవకన్య శ్రీదేవి పాత్రను ఎవరు రీ ప్లేస్ చేస్తారనేది బిగ్ డౌట్.

వాళ్ళు ఉన్నా కూడా..

వాళ్ళు ఉన్నా కూడా..

మెగాస్టార్ చిరంజీవి వారసులు ఇండస్ట్రీలో గట్టిగానే ఉన్నారు. అయితే వారిలో ఎక్కువగా రామ్ చరణ్ అయితేనే బావుంటుందని మెగా అభిమానులు కోరుకుంటారు. కానీ జగదేక వీరుడి స్థాయిని అందుకోగలడా అనేది కాస్త సందేహమే. పోనీ హీరో సెట్టయ్యాడు అనుకున్నా కూడా శ్రీదేవిని మించిన నటిమణిని పట్టుకు రావడం పెద్ద టాస్క్. ఎంత మంది ఉన్నా కూడా జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్ చెయడం అంటే సాహసమనే చెప్పాలి.

Recommended Video

30 Years Of Jagadeka Veerudu Athiloka Sundari Collections And Records
 ప్రభాస్ అంటున్నారే..

ప్రభాస్ అంటున్నారే..

రూమర్స్ ఎక్కడ పుడతాయో గాని కొన్నిసార్లు అర్థం లేకుండా వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ సినిమాకు సీక్వెల్ లో ప్రభాస్ అయితే కరెక్ట్ గా సెట్టవుతాడని ఒక టాక్ నడుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్నది అదే సినిమా అంటూ పుకార్లు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఒకవేళ ప్రభాస్ చేస్తే అభిమానులు తట్టుకోగలరా అనే ఆలోచన రాకుండా ఉండదు. రెబల్ స్టార్, మెగా ఫ్యామిలీకి చాలా మంచి స్నేహం ఉంది. వారికి ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చెప్పలేని పరిస్థితి.

సీక్వెల్ అంటే సిద్ధమే..

సీక్వెల్ అంటే సిద్ధమే..

నిర్మాత అశ్వినీదత్ అయితే చాలా వరకు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సీక్వెల్ కి సిద్ధంగానే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. నేటి తరానికి కూడా నచ్చేలా మరో స్థాయిలో రెండవసారి నిర్మించాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలని చెబుతున్నారు. ఇక ఇప్పుడు ఆ సీక్వెల్ లో ప్రభాస్ ని అనుకుంటున్నట్లు రూమర్స్ వస్తుండడంతో ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X