'జగదేక వీరుడు....’పై మోజు పడుతున్న ‘మగధీర’
చిరు తనయుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి" అంటే తనకు చాలా ఇష్టమని, ఆ చిత్రానికి కొనసాగింపుగా అంటే 'పార్ట్ -2"టైప్ లో ఎవరయినా సినిమా తీస్తానని ముందుకొస్తే, అందులో నటించడానికి తాను రెడీ అంటున్నాడు టాలీవుడ్ 'మగధీరుడు" రామ్ చరణ్.
మెగా స్టార్ చిరంజీవి అందాల తార శ్రీదేవి జంటగా వైజయంతి మూవీస్ పతాకంపై రూపోందిన చిత్రం 'జగదేక వీరుడు అతిలోక సుందరి" ఈ చిత్రం సోషియో ఫాంటసీ కథాంశంగా తెరకెక్కిన సంగతి విదితమే. అందుకే ఈ చిత్రాన్ని టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటన్నది నిర్వివాదాంశం. ప్రస్తుతానికి 'బొమ్మరిల్లు" భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా కోసం కసరత్తులు చేస్తోన్న చరణ్, తదుపరి చిత్రంగా కంప్లీట్ యాక్షన్ సినిమా చేసే అవకాశాలున్నాయి. వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడనే ప్రచారం జరుగుతోంది. మరో ప్రక్క చరణ్ హీరోగా పవన్ కల్యాణ్ ఓ సినిమాని తెరకెక్కించనున్నాడంటూ సినీ సర్కిల్స్ లో వార్తలు విన్సిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చరణ్ 'జగదేక వీరుడు అతిలోక సుందరి" సీక్వెల్ కోసం ఎప్పటికి సిద్దమవుతాడో వేచి చూడాల్సిందే!


Click it and Unblock the Notifications











