Don't Miss!
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘జగన్ నిర్దోషి’ మూవీ... కాన్సెప్ట్ ఏమిటి?
శాఖమూరి మల్లిఖార్జునరావు సూపర్ స్టార్ కృష్ణ బంధువు. ఈ చిత్రంలో ఆయన తనయుడు శివ హీరోగా నటిస్తున్నాడు. వెంకన్న బాబు దర్శకత్వంలో ఈచిత్రం రూపొందనుంది. హీరోయిన్ సంజన హీరోయిన్గా ఎంపికయింది. జగన్ రాజకీయ, వ్యక్తిగత జీవితానికి ఈచిత్రానికి ఎలాంటి సంబంధం లేదని, ఆవిషయాలపై ఇందులో ఎలాంటి చర్చ ఉండదని, అయితే.... జగన్ ఫాలోయింగ్‌ను తమ సినిమా వైపు నడిపించడమే లక్ష్యంగా ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ ఓ సంచలనం. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్ పోకడతో ఏపి రాజకీయాల్లో సెన్సేషన్ సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం జనాల్లో ఆయనకున్న ఫాలోయింగ్, జనాదరణ ఏమిటో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలే నిదర్శనం. జగన్‌కు సంబంధించి ఏ అంశం అయినా జనం ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'జగన్ నిర్దోషి' అనే టైటిల్ ద్వారా జగన్ సెంటిమెంటను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరి ఈ నిర్మాత ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో చూద్దాం...