ప్రియమణిని ప్రక్కన పెట్టి జగపతి బాబు ఆమెను పట్టుకున్నాడు
ఆ మధ్య జగపతి బాబు, ప్రియమణి మధ్య ఎఫైరంటూ సినీ మీడియా అంతా ఏకైమై కూసింది. దాన్ని నిజమే అని ప్రూవ్ చేసేందుకు జగపతి బాబు..ఆమెతో వరసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే తాజాగా జగపతి బాబు కన్ను విమల రామన్ పై పడింది. గాయం 2 చిత్రంలో జగపతి సరసన చేసిన ఆమె అంటే ఇంట్రస్ట్ ఏర్పడినట్లుంది. దాంతో తన రీసెంట్ చిత్రం చట్టం..ఎవడబ్బ సొత్తులో కూడా ఆమెనే హీరోయిన్ గా రికమెండు చేసాడు. నిజానికి ఈ చిత్రం కోసం మదాలస శర్మకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే జగపతి బాబు ఫోర్స్ చేయటంతో ఆమెని తొలిగించి విమల రామన్ ని పట్టాలు ఎక్కించాడు. తమ్ముడు డైరక్టర్ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో నట్టి కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంతో పాటు విమల రామన్..సుమంత్ తో నటిస్తున్న 'రాజ్' చిత్రం కూడా సెట్స్ మీద వుంది. అలాగే శ్రీకాంత్ తో ఆమె చేసిన 'రంగ ది దొంగ' చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











