»   » నాగార్జునకు కూడా విరోదిగా మారుతున్న జగపతి బాబు!

నాగార్జునకు కూడా విరోదిగా మారుతున్న జగపతి బాబు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: లెజెండ్ సినిమాతో ‘విలన్'గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత జగపతి బాబు దశ మారిపోయిందనే చెప్పాలి. తెలుగు సినిమాలకు ఆయన స్టార్ విలన్ అయిపోయారు. ఇటీవల విడుదలైన ‘నాన్నకు ప్రేమతో' సినిమాలో జగపతి బాబు పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడాడు. తనకు సూటయ్యే పాత్రలను పర్ ఫెక్టుగా ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు జగపతి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.... త్వరలో నాగార్జున హీరోగా తెరకెక్కే చిత్రంలో కూడా జగపతి బాబు విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తొలుత రవితేజతో అనుకున్నారు. అయితే దిల్ రాజకు, రవితేజకు మధ్య కొన్ని విబేధాలు రావడంతో ఈ ప్రాజెక్టు నుండి రవితేజ బయటకు వెళ్లినట్లు సమాచారం.

Jagapathi Babu as a villain in Nagarjuna movie

అయితే ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన దిల్ రాజు....నాగార్జునను ఒప్పించడంలో సక్సెస్ అయ్యారని టాక్. ప్రస్తుతం వేణు శ్రీరామ్ స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారని.... నాగార్జున బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా, జగపతి బాబును విలన్ క్యారెక్టర్ గా చూపించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకైతే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఏమీ రాలేదు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయానా' సంక్రాంతికి విడుదలైన బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. మరో వైపు జగపతి బాబు విలన్ గా నటించిన ‘నాన్నకు ప్రేమతో' చిత్రం కూడా బాక్సాఫీసును దడదడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమాకు అంచనాలు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

English summary
According to reports, Jagapathi Babu is likely to turn as a villain for Nagarjuna in his new movie directed by Venu Sriram.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu