»   » మహేష్ బాబుకు, జగపతి బాబుకు మధ్య శతృత్వం?

మహేష్ బాబుకు, జగపతి బాబుకు మధ్య శతృత్వం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్‌గా, టాప్ హీరోగా తన హవా కొనసాగిస్తున్న నటుడు మహేష్ బాబు. తాజాగా మహేష్ బాబు గురించిన ఓ ఆసక్తికర వార్త చర్చనీయాంశం అయింది. తనకంటే సీనియర్ నటుడు జగపతి బాబుతో మహేష్ బాబుకు శతృత్వం ఉందనే పాయింటు చుట్టూ ఈ చర్చ సాగుతోంది.

అయితే ఇదంతా రియల్ లైఫ్‌కు సంబంధించిన విషయం కాదు...రీల్ లైఫుకు సంబంధించిన విషయం మాత్రమే. త్వరలో వీరిద్దరు వెండి తెరపై బద్ద శత్రువుల్లా కనిపించబోతున్నారట. 'లెజెండ్' చిత్రంతో విలన్ పాత్రలు చేయడం మొదలు పెట్టిన జగపతి బాబు...మహేష్ బాబు హీరోగా కొరటాల శివ(మిర్చి ఫేం) దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో నటించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు జగపతి బాబు కోసం ఓ పవర్ ఫుల్ విలన్ పాత్రను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Jagapathi Babu as villain in Mahesh Babu's next movie

ఈ చిత్రం జులై నెలల ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని యుటివి సంస్థ నిర్మించబోతోంది. అతిధి తరువాత ఈ సంస్థ మహేష్ తో నిర్మిస్తున్న రెండో చిత్రమిది. ఈ సినిమా గతఏడాది ఖరారయినా కార్యరూపం దాల్చడానికి ఇంత సమయం పట్టింది. యూటీవీ మోషన్‌ పిక్చర్స్‌, ఇందిరా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. 'మిర్చి'తో ఆకట్టుకొన్న కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రం నుండి ప్రకాష్ రాజ్‌ను తప్పించి ఆ పాత్రను సోనుసూద్‌తో భర్తీ చేసారు. మహేష్ బాబు- సోను సూద్‌పై పాత్రల చిత్రీకరణ జరుగుతోంది. రాజేంద్ర ప్రసాద్ ఈచిత్రంలో మహేష్ బాబు తండ్రి పాత్రలో నటిస్తున్నారు.

English summary
According to the latest buzz, we may see Jagapathi Babu turned villain in the next movie of Prince Mahesh Babu. It is learnt that, Mahesh Babu is insisting the filmmakers of his next project to rope in this actor as the villain. It is well-known fact that, Prince Mahesh Babu is going to do a movie in the direction of Koratala Siva who directed the blockbuster movie “Mirchi” with Prabhas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu