మహేష్ సినిమాకు జగపతి బాబు తలనొప్పిగా మారాడట?

By Bojja Kumar

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై ఈ మధ్య రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో గాసిప్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో నటిస్తున్న జగపతి బాబు సినిమాకు తలనొప్పిగా మారాడట. జగపతి బాబు వెన్ను నొప్పితో బాధ పడుతున్నాడని, మధ్యలో చాలా బ్రేక్స్ తీసుకుంటున్నాడని, ఆయన కారణంగా సినిమా షూటింగ్ లేటవుతోందని అంటున్నారు.

మహేష్ తో ప్రాజెక్టు మొదలైన నాటి నుంచి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉండటం...వెంటనే దర్శకుడు కొరటాల శివ ఖండించటం కామన్ అయ్యిపోయింది. ఇటీవల శృతి హాసన్ ఆ ప్రాజెక్టు నుంచి బయిటకు వచ్చిందనే వార్త వచ్చింది. అది రూమర్ అని కొరటాల శివ ఖండించారు. కొరటాల శివ ట్వీట్ చేస్తూ... " శృతి హాసన్ మా ప్రాజెక్టు చేస్తోంది...ఇప్పటికి ఆమె ఓ షెడ్యూల్ పూర్తిచేసింది...డిసెంబర్ 10 నుంచి తర్వాత తదపురి షెడ్యూల్ మొదలవుతుంది..అసలు ఈ గాసిప్స్ ఎక్కడ నుంచి మొదలవుతున్నాయో ." అంటూ వాపోయారు. నదియా, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు కీలకమైన పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది.

Jagapathi Babu becomes headache for Mahesh

'ఆగడు' పూర్తయ్యాక మహేష్‌ సెట్‌కు వెళుతోంది ఇప్పుడే. దాంతో అందరి దృష్టీ ఈ చిత్రంపై ఉంది. కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాడంటున్నారు. హిట్ ఖాయం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్‌ శైలికి తగ్గట్టుగా మాస్‌ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X