WAR 2 మూవీలో మరో తెలుగు హీరో.. ఎన్టీఆర్‌ కోసం ఊహించని నిర్ణయం

టాలీవుడ్‌లోని హీరోలకు ఇప్పుడు దేశ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. దీనికి కారణం ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతో మంది పాన్ ఇండియా రేంజ్‌కు ఎదగడమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు, ఇప్పటికే పలువురు హీరోలు బాలీవుడ్‌లోనూ ప్రాజెక్టులు చేస్తున్నారు. అందులో RRR మూవీతో గ్లోబల్ స్టార్ అయిపోయిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు.

కొంత కాలంగా వరుసగా హిట్లు కొడుతూ ఎన్టీఆర్ ఇప్పుడు 'దేవర' అనే హై రేంజ్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. అదే సమయంలో బాలీవుడ్‌లో నేరుగా 'వార్ 2' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి తెరను పంచుకుంటున్నాడు. స్పై యూనివర్శ్ నుంచి వచ్చి సక్సెస్ అయిన 'వార్' మూవీకి ఇది సీక్వెల్‌గా రానున్న విషయం తెలిసిందే.

Jagapathi Babu Key Role In Jr NTR and Hrithik Roshan Starrer WAR 2 Movie

జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'వార్ 2' మూవీని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. అంతేకాదు, ఓ టెస్ట్ షూట్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. ఆ వెంటనే హీరోలు లేని కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించేశారు.

రెండు ఇండస్ట్రీల హీరోల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'వార్ 2' మూవీకి సంబంధించిన ప్రధానమైన షూటింగ్‌ను మరికొద్ది రోజుల్లోనే మొదలు పెట్టబోతున్నారు. అందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లపై కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఇలా ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి 2025 ఆగస్టు 14వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

Jagapathi Babu Key Role In Jr NTR and Hrithik Roshan Starrer WAR 2 Movie

క్రేజీ యాక్షన్‌తో రూపొందుతోన్న 'వార్ 2' మూవీలో చాలా భాషలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారు. ఇందులో టాలీవుడ్ నుంచి జగపతి బాబును ఎంపిక చేసుకున్నారని తెలిసింది. ఎన్టీఆర్‌కు సన్నిహితంగా ఉండే ఓ పాత్ర కోసం ఆయనను సెలెక్ట్ చేశారని తెలిసింది. త్వరలోనే జగపతి బాబు 'వార్ 2' మూవీ చిత్రీకరణలో భాగం కాబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో రాబోతున్న 'వార్ 2' మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. స్పై థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ చిత్రం కోసం సదరు సంస్థ దాదాపు రూ. 300 కోట్లు బడ్జెట్ పెడుతున్నట్లు తెలిసింది. ఇందులో ఆలియా భట్, కియారా అద్వాణీ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రీతమ్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X