Pushpa 2: పుష్ప 2లో తెలుగు హీరో కీలక పాత్ర.. ఆ సెంటిమెంట్‌తో ఇదీ హిట్టే!
గతంలో కంటే ఇప్పుడు తెలుగు చిత్రాలకు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. మన కంటెంట్‌కు ఉత్తరాది ప్రేక్షకులు ఫిదా అయిపోతోన్నారు. దీనికి పక్కా ఉదాహరణగా నిలిచిన చిత్రమే 'పుష్ప ది రైజ్'. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ విశేషమైన ఆదరణను సొంతం చేసుకుంది. ఫలితంగా ఈ చిత్రంతో బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. మరీ ముఖ్యంగా 'పుష్ప' హిందీలో వంద కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డులు నమోదు చేసింది. దీంతో అతడి రేంజ్ కూడా పెరిగింది.
'పుష్ప' సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నట్లు చిత్ర యూనిట్ ముందే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే మొదటి దాన్ని 'పుష్ప ది రైజ్' పేరిట తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ సినిమా రెండో భాగం 'పుష్ప ది రూల్' అంటూ రాబోతుంది. ఇక, దీనికి సంబంధించిన షూటింగ్‌ను కూడా మొదలెట్టారు. ఇలా ఇప్పటికే చాలా భాగం పూర్తైంది. ఇప్పటి వరకూ దాదాపుగా 40 శాతానికి పైగానే చిత్రీకరణ కూడా పూర్తైందని తెలిసింది. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా సుకుమార్ ప్లాన్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ న్యూస్ లీకైంది.

'పుష్ప ది రూల్' మూవీలో ఫలానా స్టార్ హీరో కీలక పాత్రను పోషిస్తున్నాడని ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్లు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో టాలీవుడ్‌లోని సీనియర్ హీరో జగపతి బాబు కూడా నటిస్తున్నట్లు తెలిసింది. ఆయన కోసం సుకుమార్ ఓ క్రేజీ రోల్‌ను డిజైన్ చేశాడని అంటున్నారు. గతంలో వీళ్లిద్దరి కాంబోలో 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం' చిత్రాలు వచ్చాయి. ఈ రెండూ హిట్ అయ్యాయి. దీంతో ఈ సెంటిమెంట్ ప్రకారం.. 'పుష్ప ది రూల్' కూడా హిట్టే అని కొందరు అంటున్నారు.
అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో వస్తున్న 'పుష్ప ది రూల్' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











