తెలంగాణ కోసం జగపతిబాబు పోరాటం

By Srikanya

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో దర్శకుడు ఎన్ శంకర్ "జై భోలో తెలంగాణా" చిత్రాన్ని రూపొందించే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. నూతన నటీనటులతో తీయనున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిశర ప్రాంతాల్లో షూటింగ్ జరుతోంది.ఈ నేపధ్యంలో తమ చిత్రంలో ఓ స్టార్ హీరో నటించనున్నారంటూ ప్రకటించారు. ఇంతకీ ఎన్.శంకర్ అంతలా గొప్పగా చెప్తున్న ఆ స్టార్ హీరో మరెవరో కాదు..జగపతి బాబు. తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో రూపొందుతున్న చిత్రం జై భోలో తెలంగాణా. అంతా కొత్త తారలతో రూపొందుతున్న ఈ చిత్రంలో కధానాయకుడు జగపతిబాబు ఓ కీలక పాత్రను చేస్తున్నట్లుగా సమాచారం.

స్వాతంత్ర సమరయోధుడుగా ఆయన ఈ చిత్రంలో కనిపిస్తారని తెలిసింది. తెలంగాణా సాధన కోసం చేసిన త్యాగాలు, పోరాట యోధుల గాధలు ఈ చిత్రంలో కనిపిస్తాయి. అరవై శాతం చిత్రీకరణ పూర్తయిన ఈచిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నటి స్మ్రుతి ఇరానీ ఈ చిత్రంలో తెలంగాణా తల్లిగా కనిపిస్తున్నారు.

ఈ చిత్రం గురించి ఎన్ .శంకర్ మాట్లాడుతూ...తెలంగాణ ఉద్యమంతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమాన్నీ మా చిత్రంలో చూపిస్తాం. ఈ ఉద్యమాల్ని నిష్పాక్షికంగా, ఒక జర్నలిస్టిక్ వ్యూతో చూపించబోతున్నాం. కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఇందులో కనిపిస్తాయి. ఈ చిత్రానికి చక్రి సంగీతాన్ని సమకూరుస్తున్నారు అన్నారు. హైదరాబాద్, విజయవాడ, వరంగల్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X