'పండగ చేస్కో' లో విలన్ గా జగపతిబాబు

ఇక ఈ చిత్రంలో హన్సికను హీరోయిన్ గా రామ్ సరసన ఎంపిక చేసారు. రామ్, హన్సిక కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం కావడం గమనార్హం. ఇదివరకు ఆ ఇద్దరూ 'మస్కా', 'కందిరీగ' చిత్రాల్లో కలిసి నటించారు. అలాగే ఈ చిత్రానికి 'పండగ చేస్కో' పేరును ఖరారు చేశారు. త్వరలో షూటింగ్ మొదలవుతుంది.
దర్శకుడు గోపీచంద్ మాట్లాడుతూ "డాన్ శీను, బాడీగార్డ్, బలుపు వంటి హిట్ చిత్రాల తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. రామ్ బాడీ లాంగ్వేజ్‌కి తగినట్లుగా హీరో క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా తయారయ్యే ఈ చిత్రానికి 'పండగ చేస్కో' టైటిల్ వంద శాతం సరిగ్గా సరిపోతుంది. 'సింహా' వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన బేనర్‌లో సినిమా చెయ్యడం ఆనందంగా ఉంది'' అని తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ ''అమెరికాలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నాం. రామ్‌కి తగ్గట్టుగా హుషారైన కథని తయారు చేశారు గోపీచంద్ మలినేని. తమన్ స్వరాలందిస్తారు'' అన్నారు. ఈ చిత్రాన్ని పరుచూరి ప్రసాద్ సమర్పణలో యునెటైడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తామనీ, మేలో అమెరికాలో ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నామనీ నిర్మాత కిరీటి చెప్పారు.


Click it and Unblock the Notifications











