నాని కొత్త సినిమా నుంచి షాకింగ్ అప్‌డేట్: ‘టక్ జగదీష్’లో మెయిన్ ట్విస్ట్ అదేనట
ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ప్రవేశించి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు నేచురల్ స్టార్ నాని. సహజ సిద్ధమైన నటనకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే అతడు.. ఎన్నో చిత్రాలను వన్ మ్యాన్ షోగా మార్చుకున్నాడు. తద్వారా సుదీర్ఘమైన కెరీర్‌లో ఎక్కువ శాతం విజయాలను అందుకున్నాడు. అదే సమయంలో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం నాని ఏకంగా మూడు సినిమాలను పట్టాలెక్కించేశాడు. అందులో 'టక్ జగదీష్' ఒకటి. తాజాగా ఈ మూవీ నుంచి ఓ షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.
'నిన్ను కోరి' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటిస్తోన్న చిత్రమే 'టక్ జగదీష్'. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇటీవల వచ్చిన టీజర్‌కు ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో జగపతి బాబు పాత్ర హైలైట్‌గా ఉంటుందట. ఇప్పటి వరకూ విడుదలైన పోస్టర్లు, టీజర్‌లో ఆయన చూడ్డానికి పాజిటివ్‌గా కనిపించాడు. కానీ, సినిమాలో విలన్ అతడే అని, నానిని పక్కనే ఉంటూ ఇబ్బంది పెడుతుంటాడని ఓ ట్విస్ట్ ముందే లీకైంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. రావు రమేష్, నరేష్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక, ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. దీనితో పాటు నాని 'శ్యామ్ సింగరాయ్', 'అంటే.. సుందరానికీ' అనే సినిమాలనూ చేస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











