మహేశ్ సినిమా షూటింగ్‌లో జగపతిబాబుకు అవమానం.. అలా చేయమనగానే కోపంతో..

Recommended Video

Jagapathi Babu Not Part Of Mahesh Babu’s ‘Sarileru Neekevvaru’ Anymore? || Filmibeat Telugu

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేశ్ ఆర్మీ మేజర్‌గా నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన పిక్‌ను దర్శకుడు ఇటీవలే సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే, 'సరిలేరు నీకెవ్వరు' గురించి ఓ ఆసక్తికరం విషయం బయటకు వచ్చింది.

జగపతిబాబు తప్పుకున్నాడు

జగపతిబాబు తప్పుకున్నాడు

‘సరిలేరు నీకెవ్వరు' సినిమా నుంచి జగపతిబాబు తప్పుకున్నాడని రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కథ చెప్పే సమయంలో దర్శకుడు ఏమైతే నేరేట్ చేశాడో.. షూటింగ్‌కు వెళ్లిన తర్వాత కనిపించిన కథ మరోలా ఉండడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

వాళ్లే తీసేశారు

వాళ్లే తీసేశారు

జగపతిబాబు తప్పుకోవడంపై మరో వాదన కూడా వినిపిస్తోంది. ఆయన సినిమా నుంచి తప్పుకోలేదని.. జగ్గూభాయ్‌నే చిత్ర యూనిట్ తొలగించిందని కూడా ప్రచారం జరుగుతోంది. చిత్ర దర్శకుడిని కథ గురించి ప్రశ్నించడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని కూడా అనుకుంటున్నారు. షూటింగ్ స్పాట్‌లో జరిగిన ఈ సంఘటనను అవమానంలా భావించే జగ్గూభాయ్ తప్పుకున్నాడని చిత్రసీమలో ఓ వార్త కలకలం రేపుతోంది.

ఈ సినిమా కోసం ఆఫర్లు వదులుకుని..

ఈ సినిమా కోసం ఆఫర్లు వదులుకుని..

గతంలో మహేశ్‌తో ‘శ్రీమంతుడు', ‘మహర్షి' వంటి సినిమాల్లో నటించారు జగపతిబాబు. ఈ రెండు సినిమాలూ భారీ సక్సెస్ అందుకున్నాయి. దీంతోనే ఈ సినిమా ఆఫర్ రాగానే జగ్గూభాయ్ వెంటనే ఓకే చెప్పేశాడట. అంతేకాదు, ‘సరిలేరు నీకెవ్వరు' కోస‌ం ఓ తమిళ, కన్నడ సినిమాను జగపతిబాబు వ‌దులుకున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఫీలైపోతున్న మహేశ్ ఫ్యాన్స్

ఫీలైపోతున్న మహేశ్ ఫ్యాన్స్

జగపతిబాబు - మహేశ్ కాంబినేషన్‌లో రెండు హిట్ చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో కూడా వీరిద్దరూ నటిస్తే సక్సెస్ అవుతుందని మహేశ్ బాబు అభిమానులు అనుకున్నారట. అయితే, ఇప్పుడు ఆయన సినిమా నుంచి తప్పుకోవడంతో వారంతా తెగ ఫీలైపోతున్నారని తెలుస్తోంది.

‘సరిలేరు నీకెవ్వరు' గురించి..

‘సరిలేరు నీకెవ్వరు' గురించి..

మహేశ్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు'ను అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా, ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X