ఆ ప్రేమ జంట రసూల్, జాహ్నవి
హైదరాబాద్ ఆర్యసమాజంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన మరో ప్రేమ జంట ఒకటయ్యారు. సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోరా, టీవీ యాంకర్ జాహ్నవిలు కొద్దిరోజుల క్రితం ఆర్యసమాజంలో పెళ్లి చేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సినిమాటోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కలిగిన రసూల్ తేజ సినిమాలతో వెలుగులోకి వచ్చాడు. శ్రీరామ్ హీరోగా నటించిన ఒకరి కొకరు సినిమాతో రసూల్ డైరెక్టర్‌గా కూడా మారాడు. టీవీ యాంకర్‌గా సుపరచితమైన జాహ్నవి అడపాదడపా సినిమాల్లోనూ కనిపిస్తోంది. ఆ మధ్య గోపీచంద్ హీరోగా చేసిన యజ్ఞం సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా జాహ్నవి కన్పించింది. ఆ సినిమాలో కాకా, కాకా అంటూ ధర్మవరపు సుబ్రమణ్యంతో జాహ్నవి చేసిన కామెడీ తెలుగు ప్రేక్షులకి గుర్తుండే ఉంటుంది.


Click it and Unblock the Notifications











