‘జై బాలయ్య’... స్టోరికి, టైటిల్ లింకే లేదట!

By Bojja Kumar

హైదరాబాద్: ఇటీవలే ‘భలే భలే మగాడివోయ్' సినిమాతో హిట్టు కొట్టిన నాని ‘అందాల రాక్షసి' ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాని బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిగా నటించబోతున్నాడు. సినిమాలో ఆయన చేతిపై ‘జై బాలయ్య' అనే టాటూతో కనిపిస్తారు.

ఈ సినిమాకు టైటిల్ కూడా ‘జై బాలయ్య' అనే పెట్టబోతున్నారు. బాలయ్య అభిమానులను టార్గెట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ ధీమ్ సినిమాలో కలిపినట్లు సమాచారం. వాస్తవానికి ఈ సినిమా టైటిల్ కు, స్టోరీకి అసలు లింకే ఉండదట. అయితే ఇది కలెక్షన్ల పరంగా కలిసొస్తుందని ఇలా చేసినట్లు టాక్.

Nani

వాస్తవానికి ‘జై బాలయ్య' మూవీ స్టోరీ బేసికల్ గా ఓ లవ్ స్టోరీ. అయితే హీరో బాలయ్య వీరాభిమాని. లవ్ స్టోరీతో ఈ టైటిల్ కు ఏ విధంగా న్యాయం చేస్తారో సినిమా చూస్తేగానీ చెప్పడం కష్టమే. బాలయ్యతో ‘లెజెండ్' లాంటి బ్లాక్ బస్టర్ తీసిన 14 రీల్స్ వాళ్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నిర్మాతలు రామ్ ఆచంట - గోపి ఆచంట - అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరకుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నాని అనంతపూర్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాత్రలో కనిపించనున్నాడు.. అందువల్ల ఈ చిత్రానికి ‘జై బాలయ్య' అనే టైటిల్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X