‘జై హనుమాన్' లో ధురంధర్ విలన్.. అసలు ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఏంటి?

చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న సినిమా హనుమాన్ (Hanu-Man), ఈ సినిమా టాలీవుడ్ స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లింది. తేజా సజ్జా- అమృత అయ్యర్ జంటగా నటించగా, దర్శకుడు ప్రశాంత్ వర్మ విజన్‌తో అద్భుతంగా రూపుదిద్దుకుంది. 2024లో విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో తేజ సజ్జా పాన్ ఇండియా హీరోగా, ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు. ఇక ఈ భారీ విజయానంతరం మేకర్స్ ముందుగానే సీక్వెల్‌ను ప్రకటించారు. 'హనుమాన్' కథను మరింత విస్తరించేలా 'జై హనుమాన్' అనే సీక్వెల్ రూపొందించనున్నారు.

ఈసారి కథ మరింత గ్రాండ్‌గా, మరింత విస్తృత స్థాయిలో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సీక్వెల్‌లో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు. అతను హనుమంతుడి అవతారంలో కనిపిస్తాడనే వార్తలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ సంస్థలు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్‌ను కూడా విస్తరిస్తూ, భారతీయ పురాణాలను సూపర్ హీరో ఎలిమెంట్స్‌తో మిళితం చేస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నాడు. 'హనుమాన్' విజయం తర్వాత 'జై హనుమాన్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Jai Hanuman Update Is dhurandhar fame Akshaye Khanna the Villain Prasanth Varma s Big Plan

జై హనుమాన్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమవడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన వార్తలు వరుసగా బయటకు వస్తున్నాయి. రానా దగ్గుబాటి (Rana Daggubati)కూడా ఈ సినిమాలో భాగమవ్వనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్‌లో తనదైన ముద్ర వేసుకున్న రానా, ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు వర్గాలు ఆయనను శ్రీరాముడి పాత్రలో చూడవచ్చని చెబుతుంటే, మరికొందరు విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించవచ్చని అంటున్నారు. ఏ పాత్రలో వచ్చినా రానా ప్రెజెన్స్ సినిమా స్థాయిని మరింత పెంచడం ఖాయం అనే చెప్పాలి.

ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌లతో గుర్తింపు తెచ్చుకున్న అక్షయ్ ఖన్నా, ఈ మైథాలజికల్ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం సినిమాకు మరింత బలం చేకూర్చే అంశంగా మారింది. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న సినిమాటిక్ యూనివర్స్‌లో కూడా అక్షయ్ ఖన్నా ఇప్పటికే భాగమవుతున్నట్లు వార్తలు ఉన్నాయి. ముఖ్యంగా 'మహాకాళీ' ప్రాజెక్ట్‌లో అతను కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, అదే యూనివర్స్ లింక్‌తో 'జై హనుమాన్'లో కూడా అతని పాత్ర ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అదేవిధంగా 'ధురంధర్' వంటి సినిమాతో ప్రేక్షకుల్లో మంచి ఇంపాక్ట్ సృష్టించిన అక్షయ్ ఖన్నాకు దక్షిణాది సినిమాలలో అవకాశాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు తెలుగు ప్రాజెక్టులపై చర్చలు జరుపుతున్న అతనికి, ఇప్పుడు 'జై హనుమాన్' రూపంలో మరో పెద్ద అవకాశం దక్కిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో అతని పాత్ర ఏంటి? కథలో ఎలా ఇంపాక్ట్ చూపించబోతుంది? అనే అంశాలు ప్రస్తుతం సస్పెన్స్‌గా మారాయి. కానీ అక్షయ్ ఖన్నా వంటి నటుడు ఈ ప్రాజెక్ట్‌లో చేరితే 'జై హనుమాన్' స్థాయి మరింత పెరగడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X