NBK108: బాలయ్య సినిమాలో హైలైట్ లీక్.. చెన్నకేశవ రెడ్డిని గుర్తు చేసేలా పూనకాలే!
ఆరు పదుల వయసు వచ్చినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఆయన.. 'అఖండ', 'వీర సింహా రెడ్డి' సక్సెస్‌లు ఇచ్చిన జోష్‌లో ఉత్సాహంగా ముందుకు సాగుతోన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సీనియర్ స్టార్ హీరో తన 108వ సినిమాను కూడా చేస్తున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయని చెప్పొచ్చు.
వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న నటసింహా నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న కొత్త సినిమా షూటింగ్ ప్రకటించిన తర్వాత చాలా ఆలస్యంగానే ప్రారంభం అయింది. దీనికితోడు మధ్యలో కొన్ని అనుకోని బ్రేకులు వచ్చినా.. ఇప్పుడు మాత్రం శరవేగంగానే జరుగుతోంది. ఇలా ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి 70 శాతం షూట్ పూర్తి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ ఫేమస్ స్టూడియోలో జరుగుతోంది. ఇందులో అదిరిపోయే సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.

ఇద్దరు స్టార్ల కలయికలో రాబోతున్న ఈ చిత్రంలో బాలయ్య అభిమానులు పండుగ చేసుకునే ఎపిసోడ్స్ పుష్కలంగా ఉంటాయని అనిల్ రావిపూడి ముందే చెప్పాడు. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీలో పూనకాలు తెప్పించే ఎన్నో సీక్వెన్స్‌ను పెట్టారట. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బాలకృష్ణ ఇంట్లో యాక్షన్ ఫైట్ జైలులోనే ఉంటుందట. అక్కడ కొందరు ఖైదీలతో ఆయన చేసే ఈ యాక్షన్ సీక్వెన్స్ ఫ్యాన్స్‌కు గూస్‌బమ్స్ తెప్పించే విధంగా ఉంటుందని తెలిసింది. గతంలో 'చెన్నకేశవ రెడ్డి' సినిమాను గుర్తు చేసేలా ఈ ఫైట్ డిజైన్ చేశారని సమాచారం.
బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. యంగ్ సెన్సేషన్ శ్రీలీల కూతురిగా చేస్తున్నారు. దీనికి థమన్ సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దీన్ని దసరాకు విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.


Click it and Unblock the Notifications











