40 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో.. జైలర్ 2లో రజనీకి తోడుగా బాలీవుడ్ స్టార్ హీరో?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తన స్టైలిష్ టేకింగ్, మాస్ ఎలిమెంట్స్, స్టార్ క్యామియోలతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. దీంతో భారీ విజయం అందుకుంది. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో 'జైలర్ 2' వస్తుంది. దీంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే.. తాజాగా ఈ సీక్వెల్‌కు సంబంధించి బయటకు వచ్చిన ఓ వార్త సినీ సర్కిల్ బాగా వైరలవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ఓ క్యామియో పాత్రలో కనిపించనున్నారట. అది కూడా దాదాపు 40 ఏళ్ల తర్వాత రజినీ కాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. ఇంతకీ ఏ హీరో ఎవరు?

రజనీకాంత్ నటించిన 'జైలర్ 2'లో బాలీవుడ్ స్టార్ హీరో, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఒక పవర్‌ఫుల్ కేమియో రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, గత కొన్ని వారాలుగా హృతిక్ రోషన్‌తో మూవీ మేకర్స్ చర్చలు జరుపుతుండగా, ఇటీవల ఆయన ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది కేవలం కొన్ని నిమిషాల పాటు కనిపించే సాధారణ క్యామియో కాదని, కథలో కీలక మలుపు తిప్పే పవర్‌ఫుల్ పాత్ర అని సమాచారం. ముఖ్యంగా హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లలో హృతిక్ పాత్ర కనిపిస్తుందని, ఆయన కోసం ప్రత్యేకంగా ఒక కొత్త లుక్‌ను కూడా డిజైన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Jailer 2 Buzz Hrithik Roshan s Cameo With Rajinikanth Sparks Massive Pan-India Hype

ఈ వార్తలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. రజనీకాంత్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌కు ఇప్పటికే నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది. 1986లో విడుదలైన 'భగవాన్ దాదా' సినిమాలో బాలనటుడిగా హృతిక్ రోషన్ నటించగా, అందులో రజనీకాంత్ ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపించలేదు.

దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించే అవకాశం రావడంతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపైంది. ఈ కలయిక అటు నార్త్.. ఇటు సౌత్ ప్రేక్షకులను ఒకే వేదికపైకి తీసుకురాగలదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. ఈ పాత్ర కోసం మొదట బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వివిధ కారణాలతో ఆ చర్చలు ముందుకు సాగకపోవడంతో చివరికి హృతిక్ రోషన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.

మొదటి 'జైలర్' సినిమాలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్ నటుల ప్రత్యేక పాత్రలు సినిమాకు అదనపు బలంగా నిలిచాయి. ముఖ్యంగా మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ ఎంట్రీలకు థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ బాక్సాఫీస్ కలెక్షన్లను కూడా ప్రభావితం చేసింది. ఆ విజయాన్ని దృష్టిలో పెట్టుకున్న నెల్సన్, ఈసారి 'జైలర్ 2'లో క్యామియోలను మరింత పెద్ద స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సీక్వెల్‌లో ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, విద్యాబాలన్, యోగి బాబు వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పుడు హృతిక్ రోషన్ పేరు కూడా జత కావడంతో ఈ సినిమా కేవలం తమిళ సినిమాగా కాకుండా, పూర్తి స్థాయి పాన్ ఇండియా మూవీగా మారిందనే చెప్పాలి. .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X