జైలర్ 2ని రిజెక్ట్ చేసిన బాలయ్య? రజనీకాంత్ మూవీపై షాకింగ్ డెసిషన్ .. ఆమె వల్లేనా?

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే ఎన్నడూ లేనివిధంగా పీక్స్‌లో ఉన్నారు. వరుసగా నాలుగు సినిమాలు హిట్ కొట్టడంతో పాటు పద్మ అవార్డ్, హ్యాట్రిక్ ఎమ్యెల్యేగా ఘనత, హోస్ట్‌గా సక్సెస్.. ఇలా బాలయ్య ఏది పట్టుకున్నా బంగారం అన్నట్లుగా ఉంది. ఇక తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా బాలకృష్ణకు ఆఫర్లు వస్తున్నాయి. ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా గెస్ట్ రోల్స్‌లో అయినా నటించాలని ఇతర భాషలకు చెందిన మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

టాలీవుడ్‌కే పరిమితమైన బాలయ్య
50 ఏళ్ల సినీ ప్రస్థానంలో బాలకృష్ణ ఎందుకో టాలీవుడ్‌ను దాటి మరో ఇండస్ట్రీలో అదృష్టం పరీక్షించుకోవాలని అనుకోలేదు. తన సమకాలీనులైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లు తమిళం, హిందీ తదితర భాషలలో సినిమాలు చేశారు. ఇక ప్రస్తుత తరమైతే పాన్ ఇండియా అంటూ హిందీ ఇండస్ట్రీకి చెమటలు పట్టిస్తున్నారు. కానీ బాలయ్య మాత్రం హైదరాబాద్‌ను దాటి వెళ్లలేదు. కష్టమో, నష్టమో తనకు తెలుగు సినిమాయే చాలు అనుకుని దూసుకెళ్తున్నారు.

jailer 2 Did Nandamuri Balakrishna reject a cameo in Rajinikanth Nelson sequel

క్రేజీ ఆఫర్లు రిజెక్ట్
ఇక పుట్టి పెరిగినదంతా చెన్నైలోనే అయినా, తమిళనాడులో భారీ ఫాలోయింగ్ ఉన్నా, తమిళంలో అనర్గళంగా మాట్లాడగల పట్టున్నా బాలకృష్ణ ఎందుకో కోలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పలువురు తమిళ దర్శక నిర్మాతలు ఆయనని సంప్రదించినా బాలకృష్ణ మాత్రం ఎన్నోసార్లు ఈ ఆఫర్లు తిరస్కరించారు. అలాంటిది ఓ తమిళ తంబి మాత్రం బాలయ్యతో గెస్ట్ రోల్ చేయించడానికి ఒప్పించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. రజనీకాంత్ నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.650 కోట్ల కలెక్షన్స్ రాబట్టడంతో పాటు రజనీకాంతో స్టామినాను ప్రపంచానికి చాటింది.

జైలర్‌ 2లో బాలయ్య గెస్ట్ రోల్?
జైలర్‌కు ప్రీక్వెల్‌గా జైలర్ 2 తెరకెక్కిస్తానని నెల్సన్ గతంలోనే అనౌన్స్ చేయగా.. ఈ ఏడాది సంక్రాంతికి పోస్టర్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా జైలర్ 2 రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి భాగంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ అతిథి పాత్రలు పోషించి సినిమా విజయవంతం కావడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఇదే ఫార్ములాను పార్ట్ 2లోనూ కంటిన్యూ చేయాలని నెల్సన్ భావించారు. దీనిలో భాగంగా ఓ పవర్‌ఫుల్ రోల్ కోసం బాలకృష్ణను సంప్రదించగా దీనికి బాలయ్య ఓకే చెప్పడంతో పాటు 20 రోజులు డేట్స్ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో బాలకృష్ణను నెల్సన్ ఎలా చూపించబోతున్నారోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక జైలర్ 2 కోసం బాలయ్యకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. రోజుకు 2.5 కోట్ల రూపాయల చొప్పున... 20 రోజులకు గాను 50 కోట్ల రూపాయల పారితోషికాన్ని బాలయ్యకు ఆఫర్ చేసినట్లు కోలీవుడ్ మీడియా కోడై కూసింది.

Take a Poll

జైలర్ 2 నుంచి తప్పుకున్న బాలయ్య?
అయితే గత కొద్దిరోజులుగా జైలర్‌లో బాలయ్య నటించడం లేదంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ఇందుకు పలు కారణాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. జైలర్ 2లో బాలయ్య రోల్.. ఆయన కంటే రజనీపాత్రను ఎలివేట్ చేసేలా ఉండటంతో బాలకృష్ణ మనసు మార్చుకున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న టైంలో గెస్ట్ రోల్స్ వద్దని తన చిన్న కుమార్తె తేజస్విని సలహా ఇవ్వడంతో బాలయ్య ఆలోచనలో పడి, ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసల వినిపిస్తున్నాయి. మరి నిజంగా జైలర్ 2ని రిజెక్ట్ చేశారా? లేక గాలివార్తలా? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X