Jailer 2: జైలర్ 2లో షారుఖ్ ప్లేస్‌లో ఆ సూపర్‌స్టార్? 40 ఏళ్ల తర్వాత రజనీతో స్టార్ హీరో?

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తోన్న మూవీ జైలర్ 2. గతంలో మూడేళ్ల క్రితం వీరిద్దరి కాంబోలో వచ్చిన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. కూలీ తర్వాత రజనీ నటిస్తుండటం, జైలర్ కాంబో కావడంతో జైలర్ 2పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ హైప్‌ను మరింత పెంచేందుకు కట్టుదిట్టంగా ప్లాన్ చేస్తున్నాడు నెల్సన్. తాజాగా జైలర్‌ 2కి సంబంధించి మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ జైలర్ 2ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్‌జే సూర్య, యోగిబాబు, మిర్ణా మీనన్, అన్నా రాజన్, జతిన్ సార్ణా, సూరజ్ వెంజారమూడు తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. ఆర్ నిర్మల్ ఎడిటర్‌గా, విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

Jailer 2 Hrithik Roshan in Rajinikanth s Film Nelson Plans Massive Surprise Cameo

ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 12న జైలర్ మూవీ వరల్డ్ వైడ్‌గా విడుదల అవుతుందని నిర్మాతలు ముందే ప్రకటించారు. అయితే షెడ్యూల్ కంటే ముందుగానే ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. అనుకున్న టైం కంటే ముందే పూర్తి చేయడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను నెల్సన్ పరుగులు పెట్టిస్తున్నారు. జూన్ 4న పెద్ది ఆల్రెడీ భారీ ఎత్తున విడుదల కానుంది. దీనితో పాటు జన నాయగన్, టాక్సిక్‌లు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దాంతో జూలైలో థియేటర్లు ఖాళీగా ఉండే అవకాశాలు కనిపిస్తుండటంతో జైలర్ 2 నిర్మాతలు ఈ నెలపై కన్నేసినట్లుగా గాసిప్స్ వచ్చాయి. అయితే కొందరు మాత్రం ఆగస్ట్ 12నే జైలర్ 2 రిలీజ్ అవుతుందని వాదిస్తున్నారు. కానీ ఇటీవల జైలర్ 2 విడుదల గురించి మరో ఆసక్తికర కథనం తెరపైకి వచ్చింది. దీని ప్రకారం సెప్టెంబర్ 10 లేదా 11 తేదీలలో జైలర్ 2ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. వినాయక చవితితో పాటు సెలవులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా గాసిప్స్ హల్‌చల్ చేశాయి. అయితే జైలర్ 2 రిలీజ్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఇకపోతే .. తొలిభాగంలో మాదిరిగానే జైలర్ 2లోనూ ఇతర భాషలకు చెందిన స్టార్స్ గెస్ట్ రోల్స్ చేసేలా నెల్సన్ ప్లాన్ చేశారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తదితరులు నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూడా జైలర్‌లో గెస్ట్ రోల్ పోషిస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ అనూహ్య పరిణామాల మధ్య ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దాంతో ఈ పాత్ర కోసం టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ను తీసుకోవాలని నెల్సన్ అనుకున్నారట. కానీ రాజకీయాలు, పాలనా పరమైన బిజీ కారణంగా పవన్‌- రజనీల కాంబో సెట్ కాలేదు.

తాజాగా ఈ పాత్ర కోసం బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్‌ని నెల్సన్ సంప్రదిస్తున్నారట. సినిమాలో ఈ గెస్ట్ రోల్‌ ప్రాధాన్యత దృష్ట్యా.. రజనీ స్థాయి నటుడైతే బాగుంటుందని నెల్సన్ భావిస్తున్నారట. అందుకే షూటింగ్ పూర్తయినా ఈ పాత్ర కోసం చిన్న షూటింగ్ పెట్టాల్సిందేనన్న పట్టుదలతో దిలీప్ ఉన్నారు. విడుదల ఆలస్యమైనా సరే.. పెద్ద స్టార్‌తో షూటింగ్ కంప్లీట్ చేయాలని, కథలో తాను అనుకున్న ఆ భాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించకూడదని అనుకుంటున్నారట. నెల్సన్ చర్చలు ఫలించి హృతిక్ రోషన్ కనుక జైలర్‌ 2లో నటిస్తే బాక్సాఫీస్ వద్ద విధ్వంసమే. రజనీతో హృతిక్ కాంబో అంచనాలను మించిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా.. 1986లో హిందీలో రజనీకాంత్ నటించిన భగవాన్ దాదా మూవీలో తలైవాకి కొడుకుగా, బాలనటుడిగా కనిపించారు హృతిక్. అలాంటిది దాదాపు 40 ఏళ్ల తర్వాత తిరిగి రజనీతో హృతిక్ నటిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X