రజనీకాంత్‌కు షారుఖ్‌ ఖాన్ బిగ్‌షాక్? లాస్ట్ మినిట్‌లో కింగ్‌ ఖాన్ ఊహించని ట్విస్ట్

మూడు దశాబ్ధాలుగా భారతీయ చిత్ర పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారు షారుఖ్ ఖాన్. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ ఆయనకు బలమైన ఫాలోయింగ్ ఉంది. ఇక విదేశాల్లోనూ తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. బాలీవుడ్‌ స్టార్స్‌తో పాటు దక్షిణాది హీరోలతోనూ షారుఖ్ ఖాన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో దశాబ్థాలుగా మంచి స్నేహం ఉంది. రజనీ అంటే ఆయనకు ఎంతో గౌరవం. ఈ విషయాన్ని ఆయన ఎన్నోసార్లు బయటపెట్టారు. అలాంటిది తలైవాకు షాకిచ్చారు రజనీకాంత్.

75 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లను మించి వేగంగా సినిమాలు చేస్తున్నారు రజనీకాంత్. గతేడాది కూలీతో పలకరించిన ఆయన.. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ ఈ జైలర్ 2 సినిమాను నిర్మిస్తున్నారు. రజనీ సరసన రమ్యకృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్‌జే సూర్య, యోగిబాబు, మిర్ణా మీనన్, అన్నా రాజన్, జతిన్ సార్ణా, సూరజ్ వెంజారమూడు తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. ఆర్ నిర్మల్ ఎడిటర్‌గా, విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ ఏడాది ఆగస్ట్ 12న జైలర్ 2 చిత్రం విడుదల కానుంది.

Jailer 2 Shah Rukh Khan Reportedly Opts Out of Rajinikanth Movie Fans Disappointed

జైలర్ మొదటి భాగంపై ఆసక్తి పెంచేందుకు గాను పలువురు స్టార్స్‌తో కామియో చేయించారు దర్శకుడు నెల్సన్. మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, జాకీష్రాఫ్‌లు గెస్ట్ రోల్‌లో వచ్చి అభిమానులను అలరించారు. ఇక మిల్కీబ్యూటీ తమన్నా భాటియా ఐటెం సాంగ్‌తో సినిమాకు మాస్, క్లాస్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. అన్ని రకాల ఎలిమెంట్స్‌తో రజనీ అభిమానులకు విందు భోజనం అందించారు నెల్సన్ దిలీప్ కుమార్. ఈ ఫార్ములా హిట్ కావడంతో జైలర్ 2లోనూ ఇదే సూత్రాన్ని అనుసరించాలని ఆయన భావిస్తున్నారు.

జైలర్ 2లో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిలు గెస్ట్ రోల్స్ పోషిస్తారని ప్రచారం జరిగింది. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కూడా జైలర్‌లో నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జైలర్ 2 షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. రజనీకి తోడు నలుగురు సూపర్ స్టార్స్ ఉండటంతో జైలర్ 2ను హై ఓల్టేజ్ యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు నెల్సన్. దాంతో ఈసారి ఓపెనింగ్స్ అదిరిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలాఉండగా.. జైలర్ 2కు సంబంధించి ఊహించని పరిణామం చోటు చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జైలర్‌ 2 నుంచి షారుఖ్ ఖాన్ తప్పుకున్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కింగ్ ఖాన్ కనిపిస్తారని తొలుత ప్రచారం జరిగింది. ఈ గెస్ట్ రోల్ కోసం జైలర్ 2 యూనిట్ సభ్యులు .. బాద్ షాను సంప్రదించగా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. జైలర్ 2 నుంచి షారుఖ్ ఎగ్జిట్ వెనుక కారణాలు తెలియరాలేదు. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో పాటు షారుఖ్ ఖాన్‌కు ఉన్న ఇతర కమిట్‌మెంట్స్ కారణంగానే ఆయన తప్పుకున్నట్లుగా పలు వాదనలు చక్కర్లు కొడుతున్నాయి. దాంతో రజనీ- షారుఖ్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడాలని ఆశపడ్డ అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు. అయితే జైలర్ 2 నుంచి షారుఖ్ ఖాన్ తప్పుకున్నారా? లేదా? అన్న దానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X