జనసేన పార్టీ తరుపున నాగబాబు పోటీ.. అతడికి చెక్ పెట్టాలంటే, పవన్ వద్దకు ప్రతిపాదన!
పవన్ కళ్యాణ్ పోరాటయాత్రతో ఏపీలో రాజకీయం వాడీ వేడిగా సాగుతోంది. సినీరాజకీయ వర్గాలు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తాజగా మీడియాలో ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం టివి షోలు, సినిమాలతో నీజీగా గడుపుతున్న మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీ తరుపున 2019 ఎన్నికల బరిలో నిలవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు మీడియాలో ఊహాగానాలు జోరందుకున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైన దెందులూరు నియోజకవర్గంలో ఆయన బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్లు మీడియా సంస్థల్లో కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేనికి చెక్ పెట్టాలంటే ఇదే సరైన నిర్ణయం అని పవన్ అభిమానులు భావిస్తున్నారు. నాగబాబు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరుపున ప్రచారం చేసినా క్రియాశీలకంగా వ్యవహరించలేదు.
పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్నారు. మెగా అభిమానులకు ఉభయగోదావరి జిల్లాలు పెట్టింది పేరు. నాగబాబుని బరిలోకి దించే విషయమై మెగా ఫాన్స్, జనసేన నాయకులు పవన్ పై ఒత్తిడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











