బ్రహ్మోత్సవం ఎఫెక్ట్?: ‘జనతా గ్యారేజ్’ ఫస్టు లుక్ ప్రీ పోన్డ్
హైదరాబాద్ : ఎన్టీఆర్ తాజా చిత్రం 'జనతా గ్యారేజ్' ఫస్టు లుక్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పుట్టిన రోజు అంటే ఈ నెల 20న ఈ ఫస్ట్ లుక్ ని విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం అంతకు ముందు రోజు సాయింత్రమే ఈ ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నారు.
అందుకు కారణం ఏమిటనేది అపీషియల్ గా తెలియనప్పటికీ ... మే 20 న బ్రహ్మోత్సవం విడుదల హడావిడిలో మీడియా మొత్తం మునిగిపోయి ఉంటుంది. అలాగే సినీ అభిమానులు సైతం ఆ హంగామాలో ఉంటారు. ఈ నేపధ్యంలో ఆ హడావిడి మధ్యలో రిలీజ్ చేయటం కన్నా ముందే రిలీజ్ చేస్తే రెస్పాన్స్ బాగుంటుందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.
ముఖ్యంగా ఇవి సోషల్ మీడియా రోజులు. సోషల్ మీడియాలో ఎక్కువ సేపు తమ వర్క్ గురించి చర్చ జరిగితే ఫలితం బాగుంటుందని మేకర్స్ అందరికీ తెలుసు. అదే బ్రహ్మాత్సవం హిట్టా, ఎలా ఉంది, టాక్ ఏంటి అనేదే మే 20 న ట్విట్టర్ , ఫేస్ బుక్ లో జరుగుతుంది. మీడియా సైతం బ్రహ్మోత్సవం హైలెట్స్, ఫస్ట్ డే కలెక్షన్స్, రివ్యూలపై కాన్సర్టేట్ చేస్తుంది.

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. సమంత, నిత్యమేనన్ హీరోయిన్స్. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. మోహన్‌లాల్ కీలక పాత్రధారి. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో చిత్రీకరణ జరుగుతోంది. ఎన్టీఆర్, సమంత, సితార, సురేష్‌పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.
గురువారం సాయంత్రం 'జనతా గ్యారేజ్' ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఎన్టీఆర్‌పై ప్రత్యేకంగా ఓ ఫొటో షూట్ నిర్వహించారని తెలుస్తోంది. ఆగస్టు 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.


Click it and Unblock the Notifications











