»   » ఎన్టీఆర్,కొరటాల శివ చిత్రం టైటిల్ ఇదేనా?

ఎన్టీఆర్,కొరటాల శివ చిత్రం టైటిల్ ఇదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'శ్రీమంతుడు' ఘన విజయంతో మంచి జోరు మీద ఉన్న కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో ప్లాన్ చేయబోతున్నాడనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 25 (ఆదివారం) నుంచి ప్రారంభం అవుతుందని సమాచారం. ప్రస్తుతం సుకుమార్ తో చేస్తున్న నాన్నకు ప్రేమతో చిత్రం షూటింగ్ పూర్తి కాగానే రెగ్యులర్ షూటింగ్ జరగుతుందని వినపడుతోంది.

ఈ నేపధ్యంలో ఈ చిత్రం టైటిల్ ఒకటి బయిటకు వచ్చింది. ఆ టైటిల్ ఏమిటంటే..."జనతా గ్యారేజ్", ట్యాగ్ లైన్ ఏమిటంటే... " అన్ని రిపేర్ చేయబడును". ఈ చిత్రంలో ఎన్టీఆర్ పూర్తి మాస్ గా మెకానిక్ గా కనిపిస్తాడని చెప్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ సాగే ఈ కథలోనూ అంతర్లీనంగా సెంటిమెంట్ తో కూడిన సమాజిక సందేశం ఉందని చెప్పుకుంటున్నారు.

అలాగని యాక్షన్ పార్ట్ కు ఎక్కడా లోటు రానివ్వని విధంగా స్క్రిప్టు డిజైన్ చేసాడంటున్నారు. ఇక ఈ టైటిల్ అధికారికంగా ప్రకటించింది కాదు..కేవలం ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినపడుతున్న వర్కింగ్ టైటిలే. గతంలో ఇలాంటి టైటిల్ ని గుర్తు చేసే... దాసరి ప్రధాన పాత్రలో సంసారాల మెకానిక్ అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.

Janatha Garage: Title For NTR-Koratala Film

నిజానికి రామయ్యావస్తావయ్యా చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. అయితే ఈలోపు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ టెంపర్ సినిమా చేయడం, అదే టైం లో మహేశ్ బాబు తో శ్రీమంతుడు చిత్రానికి కొరటాల శివ కమిట్ అవడంతో.. ఈ కాంబినేషన్ వాయిదా పడింది.

ఇక ఎన్టీఆర్ తాజా చిత్రం విషయానికి వస్తే...

ఎన్టీఆర్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'. ఈ చిత్ర టీజర్‌కు భారీ స్పందన లభిస్తోంది. టీజర్‌ను ఈనెల 21న విడుదల చేసిన విషయం తెలిసిందే.

దీనికి యూట్యూబ్‌లో 10 లక్షల కన్నా ఎక్కువ హిట్స్‌ వచ్చాయి. అధికారిక లెక్కల ప్రకారం విడుదలైన మూడు గంటల్లోనే దాదాపు 3 లక్షల మంది ఈ టీజర్‌ను వీక్షించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ టీజర్‌ను వీక్షించిన సినీ ప్రముఖులు దగ్గుబాటి వెంకటేశ్‌, 'కంచె' చిత్ర దర్శకుడు క్రిష్‌, యువ హీరోలు ఆది, వరుణ్‌ సందేశ్‌, హాస్య నటులు వెన్నెల కిషోర్‌ తదితరులు తారక్‌ సరికొత్తలుక్‌లో అదిరిపోయాడంటూ కితాబులిచ్చారు. ఇంత భారీ స్పందన లభించడం పట్ల చిత్ర బృందం అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ చక్రవర్తి

English summary
NTR is all set to launch his next film in Koratala Siva's direction on 25th October. Latest buzz suggests that this most eagerly awaited film has been titled "Janatha Garage", with a tagline "Anni Repair Cheyabadunu".
Please Wait while comments are loading...