రాజమౌళి సినిమాలో శ్రీదేవి కూతురు!
జాన్వీ కపూర్.. తక్కువ సమయంలో ఈ పేరు బాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ ఇటీవలే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జాన్వీ నటించిన తొలి చిత్రం ధఢక్ కు మంచి స్పందన వస్తోంది. జాన్వీ నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. ఇదిలా ఉండగా సౌత్ లో కూడా జాన్వీ హాట్ టాపిక్ గా మారిపోయింది. శ్రీదేవి అన్ని చిత్ర పరిశ్రమలలో విజయం సాధించింది.
అదే విధంగా దక్షణాది నిర్మాతలు జాన్విని ఇక్కడి సినిమాల్లో నటింపజేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. తాజగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం రాజమౌళి తెరకెక్కించబోయే ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్ చిత్రంలో జాన్విని ఓ హీరోయిన్ గా తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందొ తేలాల్సి ఉంది. రాజమౌళి చిత్రం బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కుతుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా సమీప భవిష్యత్తులో జాన్వీ తెలుగు చిత్రాల్లో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











