రష్మిక, సామ్ బాటలో జాన్వీ కపూర్ .. ఆమెని కూడా ఇలానే వాడుకోబోతున్నారా?
బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తెలుగు సినిమా వైపు చాలా మంది హీరోయిన్స్ పరిచయం అవుతూ ఉంటారు. అలా అడుగుపెట్టి మన దగ్గర స్టార్స్ అయిన హీరోయిన్స్ కూడా కోకొల్లలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హిందీ నుంచి వచ్చే హీరోయిన్స్ కి మన దగ్గర డిమాండ్ బాగానే ఉంటుంది.
ఒక్కసారి కానీ ఆ హీరోయిన్ క్లిక్ అయితే వద్దన్నా కూడా ఆమెకి తెలుగులో ఆఫర్స్ తన్నుకుంటూ వస్తాయి. ఇలా ఒకో టైం లో ఒకో హీరోయిన్ హవా చూపిస్తే ఇపుడూ టాలీవుడ్ లో తన గ్లామర్ అండ్ టాలెంట్ తో మెస్మరైజ్ చేస్తున్న మరో బాలీవుడ్ హాట్ బాంబ్ జాన్వీ కపూర్. అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా చిత్ర సీమలో అడుగుపెట్టిన ఆమె.. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం "దేవర"తో తెలుగు సినిమాలో సాలిడ్ ఎంట్రీ అందుకుంది.

మెయిన్ గా తన అందాల విందుకి ఎక్కువ మార్కులు దేవరకి పడ్డాయి. ఇదిలా ఉండగా ఇంకా ఈ సినిమా రిలీజ్ కాకుండానే తెలుగులో మరో బిగ్ ఆఫర్ ని జాన్వీ కపూర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఈమె ఇపుడు రొమాన్స్ చేసేందుకు సిద్ధం అయ్యింది.
చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేస్తున్న RC 16 ఒక రూరల్ డ్రామా అని అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా కోసం తాను స్టార్ బ్యూటీస్ సమంత, రష్మిక మందన్నల బాటలో వెళ్ళబోతున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. సమంత అలాగే రష్మిక మందన్నలు "రంగస్థలం", "పుష్ప" లాంటి సినిమాలకి తమ గ్లామర్ ని పక్కన పెట్టి డీ గ్లామ్ లుక్స్ లోకి మారిన సంగతి తెలిసిందే.

ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాలు రెండూ కూడా అదే మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పాలంటే సుకుమార్ నుంచి ఇపుడు రామ్ చరణ్ సినిమా సుకుమార్ శిష్యుడు నుంచే రాబోతుండడం గమనార్హం. కాగా ఈ మూడు సినిమాలు రూలర్ బ్యాక్ డ్రాప్ సినిమాలే కావడం ఆ రెండు సినిమాల్లో ఎలా అయితే రష్మిక, సమంతలు డీ గ్లామరస్ లుక్స్ లో కనిపించారో ఇపుడు చరణ్ సినిమాలో కూడా జాన్వీ కపూర్ వారి లానే డీ గ్లామరస్ లుక్ లో కనిపించనుందట.
రీసెంట్ గానే ఆమె లుక్ ని కూడా బుచ్చిబాబు లాక్ చేసినట్టు కూడా వినిపిస్తుంది. ఇలా మొత్తానికి ఆ టాప్ హీరోయిన్స్ బాటలోనే జాన్వీ కూడా తెలుగులో నడవబోతోందని చెప్పాలి. అలాగే సమంత రంగస్థలం లోనే కాకుండా సెన్సేషనల్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో కూడా డీ గ్లామరస్ లుక్ లోనే కనిపించింది. అలాగే జాన్వీ కూడా దేవర సినిమాలో ఓ విలేజ్ అమ్మాయిలా కనిపించిన సంగతి తెలిసిందే. కానీ ఇపుడు మాత్రం ఇంకొంచెం తక్కువ రంగులో కనిపిస్తుంది అని చెప్పొచ్చు..


Click it and Unblock the Notifications











