శ్రీలీలతోపాటు తెలుగు హీరోయిన్లకు చెక్ పెడుతున్న ఇద్దరు బాలీవుడ్ భామలు.. టాప్ హీరోను పట్టేస్తున్న బ్యూటీస్ ఎవరో
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల శ్రీలీల చేసిన సందడి చూసి ఆమె స్టార్ హీరోయిన్ గా తెలుగు సినిమా సింహాసనాన్ని అధిష్టించడం ఖాయమని అనుకున్నారంతా. కానీ సడన్ గా ఈ బ్యూటీ స్పీడ్ కి బ్రేకులు పడి, కనీసం అవకాశాలు కూడా రావట్లేదు. ఈ నేపథ్యంలోనే కొత్త హీరోయిన్ల వైపు చూస్తున్నారు మేకర్స్. అయితే ఓ ఇద్దరు హీరోయిన్లు మాత్రం సౌత్ లో పక్కా పాగా వేసేలా కనిపిస్తున్నారు. ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టి దూకుడు చూపిస్తున్నారు ఈ భామలు.
శ్రీలీలతో పాటు తెలుగు హీరోయిన్లకు చెక్ పెడుతున్న మరి ఆ హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం పదండి.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తే ఆమె ఫస్ట్ మూవీ హిట్ అయినా, లేదా స్టార్ హీరోల సరసన నటించినా చాలు దర్శకనిర్మాతలు నెక్స్ట్ మూవీలో ఆ బ్యూటీనే తీసుకోవాలని క్యూలో నిలబడతారు. ప్రస్తుతం ఇద్దరు హిందీ ముద్దుగుమ్మల విషయంలో టాలీవుడ్ మేకర్స్ ఇలాగే ఆలోచిస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లుగా మారినట్టుగా కనిపిస్తోంది.

ఆ ఇద్దరు హీరోయిన్లు ఇంకెవరో కాదు ఒకరు జాన్వి కపూర్, మరొకరు భాగ్యశ్రీ బోర్సే. ఇటీవల కాలంలో వీరిద్దరి జోరు చూస్తే వీళ్ళ సుడి మామూలుగా లేదు అనాల్సిందే. ముందుగా చెప్పుకోవాల్సింది జాన్వికపూర్ గురించి. శ్రీదేవి వారసురాలిగా హిందీ చిత్ర పరిశ్రమంలోకి అడుగుపెట్టిన జాహ్నవి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.
అయితే ఇప్పటిదాకా ఈ బ్యూటీ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను అరుదుగానే చేసింది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో జాన్వికపూర్ ఎంట్రీ గురించి ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తుండగా ఎట్టకేలకు దేవరతో అది నిజమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడిగా పాన్ ఇండియా సినిమా దేవరలో జాహ్నవి కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో తెలుగు ప్రేక్షకుల్లో ఆమెకు మరింతగా క్రేజ్ పెరిగింది.

ఈ నేపథ్యంలోనే దేవర ఇంకా రిలీజ్ కాకముందే రామ్ చరణ్ తో నటించే అద్భుతమైన అవకాశాన్ని కొట్టేసింది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో జాన్వి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అలాగే ఆమె నాని నెక్స్ట్ మూవీ లో కూడా నటించబోతోందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
ఇక భాగ్యశ్రీ విషయానికి వస్తే... మిస్టర్ బచ్చన్ మూవీ లో ఒకే ఒక్క పాటతో ఈ బ్యూటీ అందరిని అట్రాక్ట్ చేసింది. అయితే ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉండగా విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె చేతిలో ప్రస్తుతం ఈ రెండు సినిమాలతో పాటు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న మరో తెలుగు మూవీ కూడా ఉంది. ఇలా ఈ ఇద్దరు హీరోయిన్లు కనీసం టాలీవుడ్ లో ఒక్క మూవీ కూడా రిలీజ్ కాకముందే మరో రెండు ప్రాజెక్టులను పట్టేశారు. మరి తెలుగులో జాన్వి, భాగ్యశ్రీ నెంబర్ వన్ హీరోయిన్లుగా నిలదొక్కుకుంటారా అనేది వెయిట్ అండ్ సి.


Click it and Unblock the Notifications











