NTR30: ఎన్టీఆర్ మూవీకి అన్ని కోట్ల రెమ్యూనరేషన్.. రెండో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ రికార్డు
కొంత కాలంగా వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ ఉత్సాహంతోనే అతడు ఏకధాటిగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ వెళ్తోన్నాడు. దీనికితోడు RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని దక్కించుకోవడంతో మరింత జోష్‌తో కనిపిస్తున్నాడు. ఇక, ఇప్పుడు ఎన్టీఆర్.. బడా డైరెక్టర్ కొరటాల శివతో పాన్ ఇండియా సినిమాను చేయబోతున్నాడు. ఎన్నో అనుమానాల నడుమ ఈ సినిమా ప్రారంభం కాబోతుందని చిత్ర యూనిట్ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది.
పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయిన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించే ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం ఆలియా భట్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కానీ, ఆమె వ్యక్తిగత కారణాలతో దీని నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఎంతో మంది పేర్లను పరిశీలించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా కోసం అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను సెలెక్ట్ చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ మార్చి 6వ తేదీన జాన్వీ పుట్టినరోజును పురస్కరించుకుని అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, ఇందుకోసం ఓ పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. ఇందులో జాన్వీ లంగావోణీలో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ ఫిదా చేసేస్తోంది.

ఇక, ఎన్టీఆర్ సినిమా కోసం జాన్వీ కపూర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అన్న దానిపై ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ కోసం ఆమె ఏకంగా రూ. 5 కోట్లు చార్జ్ చేస్తుందట. మొదటి చిత్రంతోనే ఆమె ఇంత మొత్తం తీసుకుంటుండడం టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు 'ప్రాజెక్టు K' మూవీ కోసం దీపికా పదుకొణె ఏకంగా రూ. 10 కోట్లు తీసుకుంటుంది. ఆమె తర్వాత అత్యధిక మొత్తం చార్జ్ చేస్తున్న హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నిలిచినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీన్ని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











