మరో యంగ్ తెలుగు హీరోతో జాన్వీ కపూర్.. పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్
గత ఏడాది రెండు వరస హిట్లను తన ఖాతాలో వేసుకొని ఫుల్ ఫామ్ లో ఉన్న నాని నెక్స్ట్ మూవీ ఏంటి అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎంతోమంది దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ నాని మాత్రం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీ చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాని సరసన ఓ పాన్ ఇండియా హీరోయిన్ నటించబోతోంది అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఆ పాన్ ఇండియా హీరోయిన్ ఎవరో ఓ లుక్కేద్దాం పదండి.
గత ఏడాది రిలీజైన దసరా మూవీ నానిని మాస్ ఆడియన్స్ కు దగ్గర చేయడమే కాకుండా, ఆయనను 100 కోట్ల మూవీ క్లబ్లో చేర్చింది. అదే జోష్లో వచ్చిన హాయ్ నాన్న మూవీ కూడా క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా 175 కోట్లు కొల్లగొట్టి నాని మార్కెట్ ను మరింతగా పెంచింది. ప్రస్తుతం ఇదే జోరుతో వరుస సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు నాని. ఇప్పటికే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు.

ఆగస్టు 29న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇప్పుడు నాని నెక్స్ట్ ఏంటి అంటే సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడని వార్తలు వినిపించాయి. అయితే ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమాలో బిజీగా ఉండడం వల్ల ఇది వర్కౌట్ కాలేదని టాక్ నడిచింది. అలాగే బలగం వేణుతో నాని చేస్తాడనుకున్న ఎల్లమ్మ అనే సినిమా కూడా పట్టా లెక్కలేదు.
ఇక చివరిగా తనకు దసరా లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల స్టోరీతోనే ముందుకెళ్లడానికి నాని రెడీ అయ్యాడని అంటున్నారు. అలాగే ఈ మూవీతో పాటే హిట్ 3నీ కూడా కంప్లీట్ చేయాలని నాని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం నాని, శ్రీకాంత్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ అయ్యాయి. అందులో భాగంగానే హీరోయిన్ల వేటలో పడ్డారట మేకర్స్.

అయితే ఈ మూవీ నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న మూవీ కాబట్టి ఇందులో ఓ పాన్ ఇండియా హీరోయిన్ అయితే బాగుంటుందని భావించారట. అందుకే జాన్వీ కపూర్ ను నాని సరసన హీరోయిన్ గా నటింపజేయాలనే ఆలోచనలతో ఆమెను సంప్రదించారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి జాన్వితో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టు కోసం స్క్రిప్ట్ ను డెవలప్ చేయడానికి శ్రీకాంత్ దాదాపు రెండేళ్లు వెచ్చించారు.
ఒకవేళ జాన్వితో చర్చలు ఫలించి కార్యరూపం దాలిస్తే ఇది తెలుగులో ఆమె మూడవ సినిమా అవుతుంది. ఇప్పటికే జాన్వి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దేవర, రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నాని సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. చెర్రీ, తారక్ అంటే పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోలు కాబట్టి చేయడానికి రెడీ అయింది. కానీ నాని ఇంకా టాలీవుడ్ లో టైర్ 2 హీరోల లిస్టులోనే ఉన్నాడు. మరి ఈ మూవీ విషయంలో జాన్వి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











