Devara: దేవరలో జాన్వీ రోల్‌పై బిగ్ ట్విస్ట్.. ఆ స్టార్ హీరోకు సవతి కూతురిగానా!
టాలీవుడ్‌లో వరుసగా విజయాలను అందుకుంటూ టాప్ హీరోగా ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు RRRతో తన రేంజ్‌ను ఆస్కార్ ప్రెడిక్షన్ లిస్టుకు చేర్చుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఈ నందమూరి హీరో తన 30వ చిత్రం 'దేవర'ను చేస్తున్నాడు. టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లోనే కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోంది. దీంతో ఈ మూవీపై భారీగా హైప్ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్నారు.
కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'దేవర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చి నెలలోనే మొదలు పెట్టారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన రెండు భారీ యాక్షన్ షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మూడో దాన్ని కూడా ప్లాన్ చేశారు. ఈ తాజా షెడ్యూల్‌లో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కూడా భాగం అయ్యారు. ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

'దేవర' మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె మత్స్యకార కుటుంబానికి చెందిన యువతిగా కనిపించబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అలాగే, ఆమె అండర్ కవర్ ఆఫీసర్‌గానూ నటిస్తుందని అన్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్‌కు సవతి కూతురిగా జాన్వీ కపూర్ పాత్రను తీర్చిదిద్దారని తెలిసింది. ఈ విషయం మాత్రం సినిమాలో సస్పెన్స్‌గా ఉంటుందట. అంతేకాదు, ఇది రివీల్ అయినప్పుడు ప్రేక్షకులంతా స్టన్ అవడం ఖాయం అని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











