మోక్షజ్ఞ కోసం బాలీవుడ్ కుర్ర హీరోయిన్.. అదే నిజమైతే థియేటర్లలో పునకాలే
ఎన్నో ఏళ్ళు నుంచి తెలుగు సినిమా దగ్గర ఓ నట వారసుడి రాక కోసం ఎదురు చూస్తున్నది ఎవరైనా ఉన్నారు అంటే అది నందమూరి అభిమానులే అని చెప్పొచ్చు. కాగా నందమూరి మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి తారక మోక్షజ్ఞ్య తేజ అనే చెప్పాలి. ఎప్పుడో బాలయ్య "సంచలన విజయం సింహా" సక్సెస్ నుంచీ మోక్షు ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు పరితపిస్తున్నారు.
మరి 2010 లో విడుదల కాగా అక్కడ నుంచి 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు 2024 లో నందమూరి మోక్షజ్ఞ్య ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. మరి ఎంట్రీ ఇవ్వనుండడమే తెలుగు సినిమా యువ దర్శకుడు మొట్ట మొదటి సూపర్ హీరో సినిమా "హను మాన్" తీసి ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రశాంత్ వర్మతో సెట్ చేసుకున్నాడు. ఇలా తన మొదటి సినిమానే ఓ రేంజ్ లో మోక్షజ్ఞ్య బాలయ్యలు ప్లాన్ చేయగా ఇప్పుడు ఈ మాస్ ప్రాజెక్ట్ పై మరిన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలా ఈ కాంబినేషన్ లో హీరోయిన్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనితో బాలయ్య వారసుడు తన మొదటి సినిమాకే బాలీవుడ్ బ్యూటీతో రొమాన్స్ చేయనున్నాడు అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. పైగా ఆ బ్యూటీ మరెవరో కూడా కాదు మోక్షు తాతయ్య నందమూరి తారకరామారావు సరసన నటించిన సీనియర్ నటి శ్రేదేవి వారసురాలు అట.
కాగా శ్రీదేవికి ఉన్న ఇద్దరు కూతుళ్లతో హాట్ బాంబ్ జాన్వీ కపూర్ తన అండ చందాలతో ఆల్రెడీ భారీ చిత్రం "దేవర"తో మోక్షు అన్న జూనియర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తుంది. మరి జాన్వీ కపూర్ కి ఓ చెల్లెలు ఉంది.. ఆమెనే ఖుషి కపూర్. కాగా ఖుషి కపూర్ కూడా బాలీవుడ్ లో పలు చిత్రాలు చేసింది. ఇప్పుడు ఈమెనే బాలయ్య వారసుడి సరసన హీరోయిన్ గా తీసుకుంటున్నారు అన్నట్టుగా సినీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరి ఇలా అక్క అన్నతో చెల్లెలు తమ్ముడితో రొమాన్స్ చేయనున్నారని చెప్పాలి. మరి మోక్షజ్ఞ్య సినిమా విషయంలో ఖుషి కపూర్ ఉందో లేదో అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని కూడా ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఓ సూపర్ హీరో సినిమాగా తెరకెక్కించనుండగా హను మాన్, అధీర సినిమాలతో కలిపి ఫ్యూచర్ లో కనిపిస్తుంది.

ఇక ప్రస్తుతం బాలయ్య తన 109వ సినిమాలో బిజీగా ఉండగా రీసెంట్ గా తన సినిమా కెరీర్ లో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సినిమా ప్రముఖులు వేదిక మీదకి చేరి అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్య 109వ సినిమాని దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తుండగా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఈ సినిమాలో నటిస్తుంది. అలాగే అనిమల్ ఫేమ్ విలన్ బాబీ డియోల్ కూడా బాలయ్యతో స్క్రీన్ పంచుకుంటున్నాడు. అలాగే మేకర్స్ ఈ ఏడాది చివరలో కానీ వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











