రామ్ చరణ్‌కు జాన్వీ షాక్! అందుకే పెద్ది ప్రమోషన్స్‌కు దూరమా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది' ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా, కేవలం కంటెంట్‌తోనే కాకుండా ప్రమోషన్లతో కూడా సంచలనం సృష్టించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రమోషన్లలో కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఇంతకీ ఏమైంది?

శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్, బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసినప్పటికీ ఇంకా భారీ కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌పై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సరసన 'దేవర'లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు.. ఇప్పుడు రామ్ చరణ్‌తో 'పెద్ది'లో నటించడం ద్వారా మరో పెద్ద అవకాశాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆమె 'అచ్చియ్యమ్మ' అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

Janhvi Kapoor Skips Peddi Promotions Rumours Shake Ram Charan Pan India Film Buzz

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, 'చికిరి చికిరి' పాట సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకోవడంతో, జాన్వీ పాత్రపై కూడా పాజిటివ్ బజ్ ఏర్పడింది. అయితే ఇదే సమయంలో ఆమె ప్రమోషనల్ ఈవెంట్లకు దూరంగా ఉండబోతుందనే వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. సినిమాలో తన పాత్రకు పరిమిత స్థాయిలోనే ప్రాధాన్యం ఉందనే కారణంతోనే ఆమె పూర్తిస్థాయిలో ప్రమోషన్లలో పాల్గొనకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.

ఇక మరోవైపు కొన్ని మీడియా కథనాల ప్రకారం.. రెమ్యూనరేషన్ కారణంగానే ఈ ప్రమోషన్స్ కు జాన్వీ దూరంగా ఉండవచ్చనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారాలపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాకపోవడం గమనార్హం. ఇదంతా నిజమా? లేక కేవలం గాసిప్ మాత్రమేనా? అన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు.

సాధారణంగా పెద్ద సినిమాల విడుదల సమయంలో హీరోయిన్లు ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొని సినిమాకు హైప్ క్రియేట్ చేస్తారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల విషయంలో ఉత్తరాది మార్కెట్‌ను టార్గెట్ చేయడానికి హీరోయిన్ పాత్ర చాలా కీలకం. ఈ నేపథ్యంలో జాన్వీ వంటి బాలీవుడ్ స్టార్ ప్రమోషన్స్‌లో కనిపిస్తే సినిమా రీచ్ మరింత పెరుగుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అలాంటిది ఆమె దూరంగా ఉంటే అది సినిమా బజ్‌పై కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే మరో కోణంలో చూస్తే... జాన్వీ ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల కాల్షీట్లు సర్దుబాటు కాకపోవచ్చు అన్న వాదన కూడా ఉంది. అలాగే మూవీ టీమ్ ఏదైనా స్పెషల్ ప్రమోషనల్ స్ట్రాటజీ ప్లాన్ చేసి, చివరి నిమిషంలో ఆమెను రంగంలోకి దింపే అవకాశం కూడా ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇటీవల భారీ సినిమాలు లాస్ట్ మినిట్ ప్రమోషన్లతో హైప్ క్రియేట్ చేసిన ఉదాహరణలు ఉన్న నేపథ్యంలో, 'పెద్ది' టీమ్ కూడా అలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహ్మాన్. ఆయన అందిస్తున్న సంగీతం ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచుతోంది. భారీ బడ్జెట్‌తో మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం విజువల్‌గా కూడా గ్రాండ్‌గా ఉండబోతుందని సమాచారం. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆయన తీసుకుంటున్న ప్రతి ప్రాజెక్ట్‌పై నేషనల్ లెవెల్‌లో అంచనాలు పెరిగాయి. అలాంటి సమయంలో 'పెద్ది' సినిమా విజయం సాధిస్తే, అది జాన్వీ కెరీర్‌కు కూడా టర్నింగ్ పాయింట్ కావొచ్చు. టాలీవుడ్‌లో స్థిరపడాలని చూస్తున్న ఆమెకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఏదిఏమైనా.. 'పెద్ది' సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X