Pushpa The Rule: పుష్ప 2లో శ్రీదేవి కూతురు.. ఎలా కనిపిస్తుందో తెలిస్తే ఫ్యూజులు ఔట్
టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలా ఇప్పటికే చాలా మంది ఆ స్థాయిని చేరుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప ది రైజ్' చిత్రంతో సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు బన్నీ నేషనల్ స్టార్ అయ్యాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్' మూవీ సెన్సేషనల్ హిట్ అవడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'పుష్ప ది రూల్'కు తెరకెక్కిస్తున్నారు. పుష్ప రాజ్ సాధారణ స్మగ్లర్ నుంచి బడా వ్యాపారిగా మారి.. సిండికేట్ బిజినెస్‌ను ఎలా రూల్ చేశాడన్న స్టోరీలైన్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి.

మరిన్ని ఎక్కువ అంచనాలతో రూపొందుతోన్న 'పుష్ప ది రూల్'కు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రారంభించింది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును కూడా పూర్తి చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేసి.. ఎలాగైనా ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని చూస్తున్నారు.
మాస్ అండ్ యాక్షన్ జోనర్‌లో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పుష్ప ది రూల్' మూవీలో ఎంతో మంది స్టార్లు భాగం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 'పుష్ప 2' కోసం పాన్ ఇండియా హీరోయిన్ జాన్వీ కపూర్‌ను సెలెక్ట్ చేశారని తెలిసింది.

'పుష్ప ది రూల్' మూవీలో స్పెషల్ సాంగ్ కోసం ఎంతో మంది హీరోయిన్లను అనుకున్నారు. ఇలా ఇప్పుడు జాన్వీ కపూర్‌ను ఫైనల్ చేశారని తెలిసింది. అయితే, ఇందులో ఆమె ఒక్క పాటకు మాత్రమే పరిమితం కావడం లేదని అంటున్నారు. పుష్ప రాజ్‌ను మస్కా కొట్టించే ఓ కన్నింగ్ లేడీగా జాన్వీ కపూర్ కాసేపు ఈ సినిమాలో నటించబోతుందని కూడా తాజాగా న్యూస్ లీకైంది. దీంతో పుష్ప 2లో జాన్వీ పాత్రపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఇదిలా ఉండగా.. బన్నీ - సుక్కూ కాంబోలో రూపొందుతోన్న 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











