Devara: దేవరకు జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ ఎన్ని కొట్లో తెలుసా? ఎంత పెంచిందంటే?
ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా దగ్గర బాగా వినిపిస్తున్న టాప్ మోస్ట్ హీరోయిన్స్ పేర్లలో బాలీవుడ్ హాట్ బాంబ్ హీరోయిన్ జాన్వీ కపూర్ పేరు కూడా ఒకటి. మరి అలనాటి నటి శ్రీదేవి వారసురాలిగా ఆమె అందం, గ్లామర్ ని సొంతం చేసుకొని తెలుగులో సౌత్ ఇండియా సినిమాకి ఇప్పుడు ఈమె పరిచయం కాబోతుంది. మరి తల్లి శ్రీదేవి ఆ ఎన్టీఆర్ తో నటిస్తే కూతురు జూనియర్ శ్రీదేవి ఈ తారక రాముడు జూనియర్ ఎన్టీఆర్ తో నటించి పర్ఫెక్ట్ ఎంట్రీ ఎంచుకుంది.
కాగా వీరి కాంబినేషన్ లో వస్తున్నా భారీ పాన్ ఇండియా సినిమానే "దేవర". క్రేజీ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా ఎన్టీఆర్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా సోలో రిలీజ్ కి వస్తుంది. దీంతో ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాకి జాన్వీ కపూర్ పేరుని ఎంపిక చేసినపుడు ఈ సినిమాకి ఈమె ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటుంది అనేది కూడా బయటకి వచ్చేసింది.

దీనితో ఈమె ఏకంగా తన మొదటి సినిమాకే మూడున్నర కోట్లు అడిగితే అంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధం అయ్యారని తెలిసింది. దీనితో అంతా జాన్వీ మూడున్నర కోట్లు వార్తలు వైరల్ గా మారాయి కానీ ప్రస్తుతం మరి ట్విస్ట్ వినిపిస్తుంది. కాగా ఇపుడు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న లేటెస్ట్ రూమర్స్ ప్రకారం ఈమె మూడున్నర కోట్లు కాదు ఏకంగా 5 కోట్ల రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది.
అంతే కాకుండా ఈ మొత్తాన్ని కూడా ఈమె ఈ భారీ ప్రాజెక్ట్ కి అందుకున్నట్టు బి టౌన్ వర్గాలు చెబుతున్నాయి. సో టాలీవుడ్ లో తన డెబ్యూ తోనే జాన్వీ స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో డిమాండ్ చేస్తుంది అని చెప్పాలి. ఇలా ఈ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఈ సెప్టెంబర్ 26 న ఓవర్సీస్ లో ప్రీమియర్స్ సహా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున బెనిఫిట్ షోలు అర్ధరాత్రి షోలు కూడా పడనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ఇలా దేవర సినిమా సెన్సేషనల్ హైప్ నడుమ రిలీజ్ కి రాబోతుంది.

ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా నటిస్తుండగా తాను కూడా జాన్వీతో కలిసి తెలుగులో ఎంటర్ కాబోతున్నాడు. ఇంకా ఈ సినిమాలో అజయ్, ప్రకాష్ రాజ్, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్నారు అలాగే కొరటాల ఈ చిత్రానికి సీక్వెల్ ని కూడా ఫిక్స్ చేయగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఫలితం ఆధారంగా రానుంది. అలాగే ఈ సినిమాకి అనిరుద్ స్కోర్ ని అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అనే కొత్త బ్యానర్లు కలిసి నిర్మాణం వహించాయి. మరి దేవర మొదటి భాగం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో ఈ సెప్టెంబర్ 27 వరకు ఆగి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











