Devara: ఎన్టీఆర్‌కు షాకివ్వబోతున్న జాన్వీ.. ఆ ట్విస్ట్‌కు మైండ్ బ్లాక్ అవడం ఖాయం
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు హిట్లను ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్‌తో కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు టాలీవుడ్ టాప్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇటీవలే RRR మూవీతో తన రేంజ్‌ను గ్లోబల్ లెవెల్‌కు పెంచుకున్న అతడు..
అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తారక్ తన 30వ చిత్రం 'దేవర'ను చేస్తున్నాడు. టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లోనే కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోంది. దీంతో దీనిపై హైప్ ఏర్పడింది.

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'దేవర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చి నెలలోనే మొదలు పెట్టారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన రెండు భారీ యాక్షన్ షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు మూడో దాన్ని కూడా ప్లాన్ చేసుకున్నారు. ఈ వారంలోనే ప్రారంభం కాబోతున్న కొత్త షెడ్యూల్‌లో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కూడా భాగం కాబోతున్నారు. ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ లీకైంది.
'దేవర' మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఆమె మత్స్యకార కుటుంబానికి చెందిన యువతిగా కనిపించబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఇందులో ఆమె ఓ అండర్ కవర్ ఆఫీసర్‌గా నటిస్తుందని తెలిసింది.
కోస్టల్ ఏరియాలో ఓ డాన్ అయిన ఎన్టీఆర్‌పై నిఘా పెట్టేందుకు అధికారులు ఆమెను అక్కడకు పంపిస్తారట. అందుకే ఆమె జాలరి యువతిగా కనిపిస్తుందట. కానీ, ఆమె రియల్ క్యారెక్టర్ రివీల్ అయ్యే ట్విస్ట్ ప్రి ఇంటర్వెల్‌లో వస్తుందని తెలిసింది. ఈ సీన్‌కు అందరికీ మైండ్ బ్లాక్ అవుతుందని టాక్.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తారని ముందే ప్రకటించారు.


Click it and Unblock the Notifications











