పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి.. బెడ్ రెస్ట్ తప్పడం లేదట.. ట్రీట్‌మెంట్ స్టార్ట్!

స్టార్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన ఆరోగ్యం బాలేదని ఇటీవల ఆయనే స్వయంగా ప్రకటించారు కూడా. దీంతో మెగా అభిమానులు, జనసేన పార్టీ వర్గాలు కాసింత ఆందోళన చెందాయి. కాగా తాజా ఆయన ఆరోగ్య పరిస్థితి, చికిత్స విషయమై ఓ వార్త బయటకొచ్చింది. ఆ వివరాలు చూద్దామా..

గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలోనే

గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలోనే

హీరోగా వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్' సినిమా చేశారు పవన్. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్‌కి వెన్ను నొప్పి సమస్య మొదలైంది. అప్పటి నుంచే ఈ సమస్యకు చికిత్స తీసుకుంటూ వస్తున్నారు పవన్. మళ్ళీ ఇప్పుడు ఆ సమస్య తిరగబడటంతో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకోక తప్పడం లేదు.

గత ఎన్నికల సమయంలోనూ ఇదే సమస్య

గత ఎన్నికల సమయంలోనూ ఇదే సమస్య

జనసేన పార్టీ స్థాపించి పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలకు వెళుతున్న సమయంలో కూడా ఇదే వెన్ను నొప్పి సమస్య పవన్‌ని వెంటాడింది. ప్రచారం చేస్తున్న కీలక సమయంలో విశ్రాంతి తీసుకోక తప్పలేదు. ఈ సమస్య పట్ల సర్జరీకి వెళ్లమని వైద్యులు సలహా ఇచ్చినప్పటికీ సంప్రదాయ వైద్యం వైపు మొగ్గుచూపి ఆ దిశగా ముందుకు వెళ్లాలని పవన్ డిసైడ్ అయ్యారట.

ఎట్టకేలకు ట్రీట్‌మెంట్ స్టార్ట్

ఎట్టకేలకు ట్రీట్‌మెంట్ స్టార్ట్

తన వెన్ను నొప్పి సమస్యకు ప్రకృతి వైద్యమే మేలని భావించిన పవన్.. పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్న కారణంగా దాన్ని పక్కన బెడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ సమస్య తిరగబడటంతో ఇక తప్పదని ట్రీట్‌మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేశారని తెలుస్తోంది. ఈ ట్రీట్‌మెంట్ చాలా రోజుల పాటు కొనసాగే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

త్వరగా కోలుకోవాలని జనం..

త్వరగా కోలుకోవాలని జనం..

ప్రస్తుతం పవన్ ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ వెన్ను నొప్పి మాత్రం తీవ్రంగా మారడంతో ఆయన మరికొన్ని రోజుల పాటు ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ వర్గాలు కంగారు పడుతున్నాయి. తొందరలో ఆయన సమస్య నయం కావాలని కోరుకుంటూ ప్రార్ధనలు జనం.

యాక్టివ్ కావాల్సిన పరిస్థితి.. కానీ

యాక్టివ్ కావాల్సిన పరిస్థితి.. కానీ

జనసేన పార్టీ పూర్తి బాధ్యతలు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పైనే ఉన్నాయి. వీలైనంత తొందరలో ఆయన తిరిగి యాక్టివ్ కావాల్సిన పరిస్థితి ఉంది. సరిగ్గా ఈ సమయంలో ఆయన వెన్ను నొప్పి సమస్య తీవ్రతరమైంది. సో చూడాలి మరి.. పవన్ తిరిగి ఎప్పుడు యాక్టివ్ రోల్ లోకి వస్తారో అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X