twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాతిరత్నాలు అక్కడ ప్లాప్ అవ్వడానికి కారణమిదే.. వైల్డ్ డాగ్ ఎందుకు హిట్టయ్యిందంటే?

    |

    ఒక సినిమా రిజల్ట్ అనేది పరిస్థితుల ప్రభావం వల్ల కూడా మంచి ప్రాఫిట్స్ అందుకోవచ్చు. గతంలో సినిమా థియేటర్ వరకు వెలితేనే సినిమా ఎలా ఉందనే విషయంలో ఒక క్లారిటీ వచ్చేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావంతో నిమిషాల్లోనే వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు థియేటర్స్ vs ఓటీటీ మార్కెట్ కూడా గట్టిగానే నడుస్తోంది. ఇక ఇటీవల జాతిరత్నాలు, వైల్డ్ డాగ్ సినిమాల రిజల్ట్స్ రివర్స్ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

    ఓటీటీ సమ్రాజ్యం

    ఓటీటీ సమ్రాజ్యం

    ఓటీటీ సమ్రాజ్యం మెల్లమెల్లగా విస్తరిస్తోంది. భారీ బడ్జెట్ మీడియం బడ్జెట్ అని తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలవుతుండడం థియేటర్స్ వ్యాపారులకు భయాన్ని కలిగిస్తోంది. 100కోట్ల బడ్జెట్ సినిమా అయినా సరే డిజిటల్ మార్కెట్ లో మంచి ధరలకు అమ్ముడవుతున్నాయి.

    జాతిరత్నాలు.. F2 తరహాలోనే..

    జాతిరత్నాలు.. F2 తరహాలోనే..

    జాతిరత్నాలు సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో లాభాలను అందించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నిర్మాతలకు 30కోట్లకు పైగా షేర్ అందించిన ఆ సినిమా కోవిడ్ పరిస్థితులలో నవ్వుల సునామీ అని ఎన్నో రకాల పాజిటివ్ ట్యాగ్స్ అందుకుంది. అయితే ఓటీటీలో మొదటిసారి చూసిన వారు మాత్రం పెదవి విరుస్తున్నారు. అసలు ఈ సినిమా ఎందుకు హిట్టయ్యిందో అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. గతంలో F2 సినిమాకు కుడా ఇదే తరహాలో కామెంట్స్ వచ్చాయి.

    థియేట్రికల్ వాతావరణంలో..

    థియేట్రికల్ వాతావరణంలో..

    నిజానికి జాతిరత్నాలు సినిమాల్లో లాజిక్స్ గురించి ఆలోచిస్తే సినిమాను ఆస్వాదించడం చాలా కష్టం. కానీ చిత్ర యూనిట్ మొదటి టీజర్ నుంచి కూడా ప్రమోషన్ తో ప్రేక్షకులను ప్రిపేర్ చేసింది. కేవలం థియేట్రికల్ వాతావరణంలో చూస్తేనే సినిమా సరదాగా ఉంటుందని ప్రమోషన్స్ బాగానే చేసింది. ప్రేక్షకుల్లో కూడా అదే ఆలోచనతో థియేటర్స్ లోకి వెళ్లారు. థియేటర్స్ లో హడావుడి మధ్య లాజిక్స్ గురించి ఎక్కువ మంది ఆలోచించలేదు. కోవిడ్ తరువాత వచ్చిన కామెడీ సినిమా కాబట్టి పాజిటివ్ మైండ్ తోనే వెళ్లడం సినిమాకు కలిసొచ్చింది.

    వైల్డ్ డాగ్ ఓటీటీ హిట్టు

    వైల్డ్ డాగ్ ఓటీటీ హిట్టు

    ఇక నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా మాత్రం థియేట్రికల్ గా డిజాస్టర్ అవ్వగా ఓటీటీలో మాత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ లో సౌత్ టాప్ 1లో ట్రెండ్ అయ్యింది. 48గంటల్లోనే అత్యదిక రికార్డ్స్ అందుకున్న తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్ గా ఎందుకు హిట్టవ్వలేదు అనే కామెంట్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి.

    థియేటర్స్ లో ఎందుకు ప్లాప్ అంటే..

    థియేటర్స్ లో ఎందుకు ప్లాప్ అంటే..

    కోవిడ్ పరిస్థితులు ఎక్కువవుతున్న తరుణంలోనే వైల్డ్ డాగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతే కాకుండా అన్ని వర్గాల అడియెన్స్ ఈ సినిమాను థియేటర్స్ లో చూడడానికి ఎక్కువగా ఇష్టపడలేదనే కామెంట్స్ వచ్చాయి. వెంటనే వకీల్ సాబ్ రావడం థియేటర్స్ క్లోజ్ అవ్వడం కూడా సినిమాను నిలదొక్కుకొనివ్వకుండా చేశాయి. ఇక ఫైనల్ గా ఇప్పుడు ఇది ఓటీటీ కంటెంట్ అనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమాల రిజల్ట్ తో భవిష్యత్తులో ఓటీటీ vs థియేటర్స్ అనే వార్ గట్టిగానే నడిచేలా ఉన్నట్లు కామెంట్స్ వస్తున్నాయి.

    English summary
    Talented young hero Naveen Polisetti, who received a special craze of his own with agent Sai Srinivasa Atreya, is the next film to come out as the protagonist. Along with Naveen, star comedians Rahul Ramakrishna and Priyadarshi also played important roles in the film. However, the film unit is thinking hard about the promotion of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X